ETV Bharat / entertainment

47ఏళ్ల వయసులో మీనా రెండో పెళ్లి - ఆమె ఏం చెప్పిందంటే? - Meena Second Marriage

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 24, 2024, 7:27 AM IST

Actress Meena Second Marriage : సీనియర్ నటి మీనా రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలం నుంచి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఆమె తాజాగా స్పందించింది. ఏం చెప్పిందంటే?

47ఏళ్ల వయసులో మీనా రెండో పెళ్లి - ఆమె ఏం చెప్పిందంటే?
47ఏళ్ల వయసులో మీనా రెండో పెళ్లి - ఆమె ఏం చెప్పిందంటే?

Actress Meena Second Marriage : టాలీవుడ్ హీరోయిన్ మీనా 90లో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఆమె సహజనటన ఎంతోమందిని ఆకట్టుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత మీనా ఇండస్ట్రీకి కొద్ది కాలం దూరంగా కూడా ఉంది. అయితే ఆ మధ్య తన భర్తను కోల్పోయింది మీనా. ఆ బాధ నుంచి బయటపడేందుకు మళ్లీ సినిమాల్లో నటిస్తోంది. వరుస షూటింగ్స్​తో బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేస్తోంది. అయితే గతకొన్నాళ్లుగా మీనా రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికార్లు చేస్తున్నాయి.

త్వరలోనే మీనా రెండో వివాహం చేసుకోబోతుందని వరుడు కూడా ఫిక్స్ అయ్యారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ తోపాటు కోలీవుడ్​లోని కొందరి పేర్లు కూడా వినిపించాయి. ఈ పుకార్లన్నీ కూడా మీనాకు చాలా విసుగు తెప్పించాయి. భర్తను కోల్పోయిన బాధలో ఉంటే సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలు రావడంపై మీనా తీవ్రమనోవేదనకు గురైందట.

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనా తాను రెండో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయినట్లు వచ్చిన వార్తలపై స్పందించింది. ఇలాంటి రూమర్స్ వైరల్ చేస్తున్నవారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బు కోసం ఏమైనా రాస్తారా సోషల్ మీడియా, మీడియా నానాటికీ దిగజారిపోతుందని, వాస్తవాలు తెలుసుకుని రాయడం మంచిదంటూ చెప్పుకొచ్చింది. తాను ఒంటరిగానే ఉంటానని దేశంలో ఒంటరిగా జీవిస్తున్న మహిళలు ఎంతో మంది ఉన్నారని చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు, కూతురు భవిష్యత్తు కోసం తాను ఆలోచిస్తున్నట్లు చెప్పకొచ్చింది.

తాను భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటానో ఇప్పుడేలా చెబుతానంటూ ప్రశ్నించింది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తనకు తెలియదని ప్రస్తుతానికి రెండో పెళ్లి గురించి ఆలోచనలేదని చెప్పింది. ఒకవేళ తనకు రెండో వివాహం చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే స్వయంగా ప్రకటిస్తానని పుకార్లు క్రియేట్ చేయోద్దంటూ క్లారిటీ ఇచ్చింది మీనా. ఇకపోతే ఆమె చివరిగా తెలుగులో దృశ్యం 2 సినిమాతో అలరించారు. ప్రస్తుతం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాలో నటించబోతున్నట్లు తెలిపారు. కానీ ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ జరుపుకోవట్లేదని చెప్పారు.

హనుమాన్ ర్యాంపేజ్​ - అస్సలు తగ్గట్లే! - Hanuman Movie Records

ఆ హీరో ఎంట్రీ కోసం గ్రాండ్ అరేంజ్​మెంట్స్ - 1000 మంది డ్యాన్సర్లతో స్పెషల్ సాంగ్​! - 1000 Dancer For Song Shoot

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.