ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - రైల్వే జాబ్​ క్యాలెండర్ 2024 విడుదల

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 10:13 AM IST

RRB Job Calendar 2024 In Telugu : నిరుద్యోగులకు, రైల్వే జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ 2024 జాబ్​ క్యాలెండర్​ను విడుదల చేసింది. పది, ఇంటర్​, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీలు చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. పూర్తి వివరాలు మీకోసం.

Railway Job Calendar 2024
RRB Job Calendar 2024

RRB Job Calendar 2024 : రైల్వే శాఖ నిరుద్యోగులకు, ఆర్​ఆర్​బీ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తీపి కబురు అందించింది. రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్​ పరిధిలోని వివిధ జోన్లలోని ఉద్యోగాల నియామక పరీక్షలకు సంబంధించిన 2024 జాబ్​ క్యాలెండర్​ను విడుదల చేసింది.

రైల్వే శాఖ ఇప్పటికే 5,696 అసిస్టెంట్ లోకో పైలట్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మరో 9,000 టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం సమాయత్తం అవుతోంది. తాజాగా 2024లో చేపట్టనున్న ఉద్యోగ నియామక పరీక్షల వార్షిక క్యాలెండర్​ను విడుదల చేసింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్​ఆర్​బీ జాబ్ క్యాలెండర్-2024 వివరాలు

జాబ్ నోటిఫికేషన్షెడ్యూల్​
అసిస్టెంట్​ లోకో పైలట్​ జనవరి - మార్చి
టెక్నీషియన్ఏప్రిల్​ - జూన్​
నాన్​-టెక్నికల్ పాపులర్​ కేటగిరీ - గ్రాడ్యుయేట్​ (లెవెల్​ 4, 5, 6)జులై - సెప్టెంబర్​
నాన్​-టెక్నికల్ పాపులర్ కేటగిరీ - గ్రాడ్యుయేట్ (లెవెల్ 2, 3)జులై - సెప్టెంబర్​
జూనియర్ ఇంజినీర్జులై - సెప్టెంబర్​
పారామెడికల్ కేటగిరీజులై - సెప్టెంబర్​
మినిస్టీరియల్​, ఐసోలేటెడ్​ కేటగిరీ (లెవెల్ 1)అక్టోబర్ - డిసెంబర్​

ప్రిపరేషన్​
పది, ఇంటర్​, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు రైల్వే పోస్టులకు అర్హులు. వీరికి రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్​ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా రైల్వే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్​లో ఉంటాయి. అయితే రైల్వే శాఖ 2024 జాబ్​ క్యాలెండర్ విడుదల చేసింది కనుక, ఇప్పటి నుంచే సరైన ప్రణాళికతో చదివితే, మీరు కోరుకున్న ఉద్యోగం సాధించడం గ్యారెంటీ. ఆల్​ ది బెస్ట్.

రైల్వే టెక్నీషియన్ నోటిఫికేషన్​
పట్నా రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అందులో నియామక ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించింది. మీరు పట్నా ఆర్​ఆర్​బీ అఫీషియల్ వెబ్​సైట్​ను సందర్శించి కూడా ఆయా వివరాలను తెలుసుకోవచ్చు. రైల్వే శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం 9000 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారని పట్నా ఆర్​ఆర్​బీ వెల్లడించింది. అయితే టెక్నీషియన్​ రిక్రూట్​మెంట్​కు సంబంధించి పూర్తి వివరాలను ఫ్రిబ్రవరిలో ఎంప్లాయిమెంట్ న్యూస్​లో ప్రచురిస్తారని తెలిపింది. ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మార్చిలో ప్రారంభం అయ్యి ఏప్రిల్​​లో ముగుస్తుందని ఆర్​ఆర్​బీ తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.

రైల్వేశాఖ జారీచేసిన అధికారిక ప్రకటన వివరాలివే!
రైల్వేశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ఆర్​ఆర్​బీ టెక్నీషియన్​ పోస్టులకు సంబంధించి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇది టెంటేటివ్(తాత్కాలిక క్యాలెండర్) అని రైల్వేశాఖ తెలిపింది.

  • మొత్తం పోస్టుల సంఖ్య : 9000
  • ఎంప్లాయ్​మెంట్ న్యూస్​లో నోటిఫికేషన్​ ప్రచురించే తేదీ : 2024 ఫిబ్రవరి
  • ఆన్​లైన్​లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 మార్చి- ఏప్రిల్
  • కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్​లు(సీబీటీ) నిర్వహణ : అక్టోబర్- డిసెంబర్​
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్​ తేదీ : 2025 ఫిబ్రవరి

ఇంటర్​, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు- దరఖాస్తు చేసుకోండిలా!

తాపీ మేస్త్రీకి నాలుగున్నర లక్షల జీతం - పర్మనెంట్​ జాబ్​ - అప్లై చేస్తారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.