ETV Bharat / education-and-career

జీతం లక్షల్లో, జీవితం లగ్జరీగా!​ - మీరు కూడా అవుతారా పైలట్​? - How to Become a Pilot

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 3:44 PM IST

How to Become a Pilot: చాలా మందికి పైలట్​ అవ్వాలనే కోరిక ఉంటుంది. తమ కలను నిజం చేసుకొని గగనతలంలో విహరించాలని ఆశపడతారు. కానీ.. అందుకు అర్హతలేంటి? ఏం చదవాలి? ఎలాంటి శిక్షణ తీసుకోవాలి? అనే వివరాలు తెలియదు. అలాంటి వారి కోసమే ఈ స్టోరీ..

How to Become a Pilot
How to Become a Airline Pilot (ETV Bharat)

How to Become a Pilot: జాబ్​ చేయాలనుకునే వారిలో కొందరు భిన్నంగా ఆలోచిస్తారు. కెరియర్‌ను కొత్తగా ప్లాన్‌ చేసుకుంటారు. అందరూ చేసే ఉద్యోగాలు కాకుండా కొత్త ఉద్యోగాలకు ట్రై చేస్తుంటారు. అలాంటి వాటిలో పైలట్​ ఒకటి. ఈ జాబ్​ సంపాదిస్తే లక్షల జీతంతోపాటు లగ్జరీ లైఫ్‌ను పొందవచ్చు. పైలట్‌గా మారి గగనతలంలో విహరించవచ్చు. అయితే చాలా మందికి దీనిపై అవగాహన ఉండదు. మరి పైలట్‌గా ఎలా మారాలి..? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ప్రస్తుతం భారతీయ విమానయాన పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి 4.33 బిలియన్ల డాలర్ల వృద్ధిని సాధిస్తుందని అంచనా. ఇండియాలో రాబోయే 20 ఏళ్లలో దాదాపు 31వేల పైలట్ల అవసరం ఉంటుందని కొన్ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇండియన్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఇండస్ట్రీ ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. ఈ పరిణామాలు ఏవియేషన్ ఇండస్ట్రీలో స్కిల్డ్‌ వర్కర్స్‌ డిమాండ్‌ను సూచిస్తున్నాయి. ఈ క్రమంలోనే పైలట్​ కావాలంటే అర్హతలు ఏంటో చూద్దాం..

అర్హతలు: పైలట్ జాబ్ సాధించాలంటే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తర్వాత ఏదైనా ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంట్రన్స్‌ పరీక్ష రాసి పాస్ కావాలి. మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూల్లోనూ ఉత్తీర్ణత సాధించాలి. ఇవి క్లియర్ చేసిన తర్వాత సదరు ఏవియేషన్ ఇన్‌స్టిట్యూట్‌లో జాయినింగ్​ ఉంటుంది. అక్కడ మీకు పైలెట్‌ శిక్షణ ఇస్తారు.

ఇండియన్ ఆర్మీ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ - ఉచితంగా ఇంజినీరింగ్ విద్య + మిలిటరీ ట్రైనింగ్​ - Indian Army TES 2024

ఎయిర్‌ఫోర్స్‌లో చేరే అవకాశం: మీరు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్ కావాలనుకుంటే ఇంటర్‌ తర్వాత UPSC, NDA పరీక్ష, ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (AFCAT), NCC స్పెషల్ ఎంట్రీ స్కీమ్ పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. ఆ తర్వాత ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా ఉద్యోగం పొందడానికి మీరు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్షనూ రాయవచ్చు.

వాణిజ్య పైలట్: ఇంటర్‌ తర్వాత ఏవియేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది కమర్షియల్‌ పైలట్‌ కూడా కావచ్చు. శిక్షణ పూర్తయిన తర్వాత మీరు కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) కోసం ఫిట్‌నెస్ పరీక్ష, రాత పరీక్ష రాయాలి. తరువాత విజయవంతమైన అభ్యర్థులు తమ వృత్తిని వాణిజ్య పైలట్‌గా ప్రారంభించవచ్చు. అయితే.. కమర్షియల్‌ పైలట్ లైసెన్స్(CPL) పొందడానికి కనీసం 18 సంవత్సరాలు నిండాలి. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. ఇందుకు మెడికల్‌ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఏ రకమైన లైసెన్స్ కావాలని కోరుకుంటున్నారు? ఏ విమానాలను ఆపరేట్ చేయాలనుకుంటున్నారు? అనే దానిపై పైలట్‌ ట్రైనింగ్‌, లైసెన్స్‌ ఆధారపడి ఉంటుంది. CPL లైసెన్స్ కావాలంటే, కనీసం 200 గంటల ఫ్లయింగ్ టైమ్ చేయాలి.

జీతం ఎంత? : జూనియర్ కో-పైలట్లకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జీతం ఉంటుంది. చీఫ్ పైలట్లకు కనీస వేతనం రూ.3 లక్షలు. అయితే.. ఇది విమానయాన సంస్థను బట్టి మారుతుంటుంది. అనుభవంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది.

కెరీర్​ ఆప్షన్స్​: ప్రస్తుతం ప్రధాన విమానయాన సంస్థలు కొత్త పైలట్‌లను నియమించుకుంటున్నాయి. మిలటరీ, కార్పొరేట్, కార్గో రంగాలలో కూడా పైలట్లకు అవకాశాలు ఉన్నాయి. లార్జ్‌ ప్యాసింజర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ నడిపే కమర్షియల్ ఎయిర్‌లైన్ పైలట్లు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసే మిలటరీ పైలట్లు, బిజినెస్‌లు, వ్యక్తుల కోసం చిన్న ఎయిర్‌క్రాఫ్ట్‌లు నడిపే ప్రైవేట్ జెట్ పైలట్లు.. ఇలా వివిధ రకాల కెరీర్‌లు అందుబాటులో ఉన్నాయి. రెస్క్యూ మిషన్లు, సైట్‌సీయింగ్‌ వంటి వివిధ ప్రయోజనాల కోసం హెలికాప్టర్లు నడిపే పైలట్లకు కూడా డిమాండ్‌ ఉంది.

పది, ఇంటర్​ అర్హతతో - నౌకాదళంలో అగ్నివీర్​ పోస్టులు - మహిళలూ అర్హులే! - Navy Agniveer Recruitment 2024

డిగ్రీ అర్హతతో 506 అసిస్టెంట్ కమాండెంట్​ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - UPSC Jobs

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.