ETV Bharat / business

కొత్త కారు కొనాలా? కంఫర్ట్ కాదు సేఫ్టీయే ముఖ్యం- ఈ 6 ఫీచర్లు ఉంటేనే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 6:59 PM IST

Things To Check Before Buying A Car : కొత్త కారు కొనేటప్పుడు కంఫర్ట్​ జోన్​ను మాత్రమే కాకుండా ముఖ్యంగా అందులోని సేఫ్టీ ఫీచర్స్​ను కూడా చూసి తీసుకుంటే మీ భద్రతపరంగా మంచిదని సూచిస్తున్నారు ఆటోమొబైల్​ ఎక్స్​పర్ట్స్​. ఈ నేపథ్యంలో కొత్తగా కారు తీసుకోవాలనుకునే వారు గుర్తుంచుకోవాల్సిన 6 ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Things To Check Before Buying A Car
Things To Check Before Buying A Car

Things To Check Before Buying A Car : కొత్తగా కారు కొనాలనుకునే వారు కారు కంఫర్ట్​ను మాత్రమే కాకుండా అందులోని సేఫ్టీ ఫీచర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏ కంపెనీ కారు కొనేముందైనా అందులో ఈ కింది అంశాలు ఉన్నాయా? లేవా? అని చెక్​ చేసుకొని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీకు, మీ కుటుంబ సభ్యుల భద్రతకు ముడిపడిన అంశం కాబట్టి. మరి ఆ సేఫ్టీ ఫీచర్స్​ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎయిర్​బ్యాగ్స్​
ఎయిర్​బ్యాగ్స్​- కారులోనే అత్యంత ప్రధానమైన సేఫ్టీ ఫీచర్​. ముఖ్యంగా మీరు తీసుకునే కారులో ఎయిర్​బ్యాగ్స్​ ఉన్నాయా? లేవా? అని చెక్​ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏదైనా యాక్సిడెంట్​ అయినప్పుడు ప్రమాద తీవ్రతను ఇవి తగ్గిస్తాయి. అయితే చాలా వరకు కార్లు ఎయిర్​బ్యాగ్స్​తో వస్తున్నా, అందులో కేవలం 2 ఎయిర్​బ్యాగ్స్​ను మాత్రమే ఏర్పాటు చేస్తున్నాయి కంపెనీలు. కొన్ని కంపెనీలు 6 వరకు ఎయిర్​బ్యాగ్స్​ను కూడా తమ వినియోగదారుల భద్రత దృష్ట్యా కార్లలో ఫిక్స్​ చేస్తున్నాయి. ఇలా 6 ఎయిర్​బ్యాగ్స్​ ఉన్న కారులను మాత్రమే కొనుగోలు చేస్తే భద్రతపరంగా మీకు, మీ కుటుంబానికి మంచిది!

టీపీఎంఎస్​
టీపీఎంఎస్​- టైప్​ ప్రెజర్​ మానిటరింగ్​ సిస్టమ్​. ఈ సిస్టమ్​ మీరు కొత్తగా తీసుకునే కారులో ఉందా? లేదా? అని నిర్ధరించుకోండి. ఇది మీ కారు టైర్లు ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా సాఫీగా నడిచేలా చేస్తాయి. ఈ వ్యవస్థ మీ కారు​ చక్రాల్లోని గాలి ఒత్తిడిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. టైర్లలో గాలి తక్కువగా ఉన్నప్పుడు చూసుకోకుండా అలానే రోడ్డుపై నడిపితే ఒక్కోసారి అవి పేలిపోయే అవకాశాలు ఉంటాయి. తద్వారా మీరు కంట్రోల్​ కోల్పోయి ప్రమాదాల బారిన పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు కొనే కారులో టీపీఎంఎస్​ ఉంటే ఇది మీ కారు టైర్ల పనితీరు గురించి మిమ్మల్ని లేదా డ్రైవర్​ను ఎప్పటికప్పుడు అలర్ట్​ చేస్తుంది.

ఇన్​-బిల్ట్​ నావిగేషన్​
ఈ ఇన్​-బిల్ట్​ నావిగేషన్​ అనేది మీ స్మార్ట్​ఫోన్​కు పని చెప్పకుండా చేస్తుంది. అంటే మీరు ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు మొబైల్​లో ఉండే లొకేషన్​ మ్యాప్స్​ను ఓపెన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాంటి ఫీచర్​ ఉన్న కారును తీసుకుంటే అత్యవసర సమయాల్లో మీకే ఉపయోగపడుతుంది. అయితే ఇలాంటి ఫీచర్​ను​ చాలా వరకు కార్లలో ఆప్షనల్​ పద్ధతిలో ఏర్పాటు చేస్తున్నాయి పలు కార్ల కంపెనీలు.

పార్కింగ్​ సెన్సార్లు
పార్కింగ్​ సెన్సార్‌లు- పేరులోనే దీని ప్రాముఖ్యత గురించి మీకు తెలిసిపోతుంది. ముఖ్యంగా మన కారును పార్క్​ చేసే సమయాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటాం. కొన్ని చిన్నపాటి లేదా ఇరుకుగా ఉండే ప్రదేశాల్లో మీరు ఇతరులకు (వ్యక్తులు, వస్తువులు) ఇబ్బంది లేదా హాని కలగజేయకుండా ఈ పార్కింగ్​ సెన్సార్స్​ దోహదపడతాయి. మీరు చూసుకోకుండా ఏదైనా వస్తువును లేదా వ్యక్తిని తాకితే కారు లోపల ఉండే స్క్రీన్​ మిమ్మల్ని అలర్ట్​ చేస్తుంది. దీనికి తోడు ఓ బీప్​ సౌండ్​ కూడా మీకు వినిపిస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న అన్ని కార్లు బ్యాక్​ సెన్సార్స్​తో వస్తున్నప్పటికీ, కొన్ని కంపెనీలు మాత్రమే ఫ్రంట్​ సెన్సార్స్​ ఫీచర్​నూ తమ కార్లలో అమరుస్తున్నాయి. ఇలా రెండు రకాలుగా సెన్సార్​లు ఉన్న కారును కొంటే ఉత్తమం.

క్రూయిజ్​ కంట్రోల్
కార్లలో రెండు రకాల క్రూయిజ్​ కంట్రోల్​లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి స్టాండర్డ్​ క్రూయిజ్​ కంట్రోల్​​, రెండోది అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​​

స్టాండర్డ్​ క్రూయిజ్​ కంట్రోల్​
స్టాండర్డ్​ క్రూయిజ్​ కంట్రోల్​ మిమ్మల్ని హైవేపై ఓ మోస్తరు స్పీడ్‌లో వెళ్లేలా చేస్తుంది. కానీ, ఈ వేగం మీరు వెళ్లాలనుకునే స్పీడ్​​లో ఉండకపోవచ్చు. అది కూడా మీరు వెళ్లే మార్గంలో కార్లు లేదా ఇతర వాహనాలు లేకపోతే లేదా పరిమిత సంఖ్యలో వాహనాలు ఉంటే కాబట్టి మీ కారు స్పీడ్​ను పెంచుతుంది ఈ స్టాండర్డ్​ క్రూయిజ్​ కంట్రోల్​. అయితే ఈ కంట్రోల్​ను ఎనేబుల్​ లేదా డిసెబుల్​ చేసే ఆప్షన్​ మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది.

అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​​
రెండోది కారులోని అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​ను అధునాతనమైన సేఫ్టీ ఫీచర్​గా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక కారు లేదా వాహనానికి మీరు అత్యంత దగ్గరగా వెళ్లేంత వరకు కూడా మీరు ఓ నిర్దిష్టమైన​ స్పీడ్​లో వెళ్లవచ్చు. ఎప్పుడైతే వేరే వాహనాలు మీ కారుకు దగ్గరగా వస్తాయో అప్పుడు మీ కారు స్పీడ్​ను ఈ అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్ నియంత్రిస్తుంది. అంటే మీ వాహనం స్పీడ్​ను తగ్గిస్తుంది. అంతే కాకుండా మిమ్మల్ని లేదా డ్రైవర్​ను సురక్షితమైన లైన్​లో డ్రైవ్​ చేయమని హెచ్చరిస్తుంది. కారులో ఉండే కెమెరాలు, లేజర్స్​, రాడార్స్​ ద్వారా ఈ వ్యవస్థ పనిచేస్తుంది.

ఏఈబీ
ఏఈబీ- ఆటోమేటిక్​ ఎమర్జెన్సీ బ్రేకింగ్​. ఈ ఫీచర్​ కూడా ఒక విధంగా క్రూయిజ్​ కంట్రోల్​ వ్యవస్థలానే పనిచేస్తుంది. మీ కారు అనుకోకుండా ఏదైనా వాహనానికి లేదా వస్తువుకు దగ్గరగా వెళ్లినప్పుడు ఈ ఏఈబీ సిస్టమ్​ ఆటోమేటిక్​గా బ్రేక్​లను వేస్తుంది. దీంతో మీరు ప్రయాణించే కారు, మీరూ ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఏఈబీ సిస్టం మొత్తం బ్రేక్​లు వేయదు. అంటే మనం సాధారణంగా వేసే బ్రేక్​ల మాదిరిగా బ్రేక్​లు పడవు. నామమాత్రపు బ్రేక్​ వేసి మాత్రం మీ కారు వేగాన్ని తగ్గిస్తుంది. ఈ వ్యవస్థ కూడా సెన్సార్​ల సాయంతో నడుస్తుంది. అయితే దీనిని యాక్టివేట్​, ఇన్​యాక్టివేట్​ చేసుకునే సౌలభ్యం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. కాగా, ఈ ఏఈబీ ఇంకో విధానంగానూ ఉపయోగపడుతుంది. పెద్ద నగరాల్లో ట్రాఫిక్​ ఉన్నప్పుడు కూడా మీ కారు స్పీడ్​ను ఈ ఏఈబీ కంట్రోల్​ చేస్తుంది.
మొత్తంగా పైన తెలిపిన ఫీచర్స్​ అన్నీ మీరు తీసుకునే కొత్త కారులో ఉన్నాయా? లేవా? అని ఒకటికి రెండు సార్లు చెక్​ చేసుకొని తీసుకుంటే మంచిది.

ఆల్​-టైమ్ హై రికార్డ్​ల వద్ద ముగిసిన సెన్సెక్స్ & నిఫ్టీ!

క్రెడిట్​ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్​ - ఇకపై మీకు నచ్చిన కార్డ్​ను ఎంచుకోవచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.