ETV Bharat / business

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు - రాణిస్తున్న బ్యాంకింగ్, టెక్ సెక్టార్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 9:58 AM IST

Updated : Mar 12, 2024, 10:29 AM IST

Share Market Close Today March 12th 2024
Stock Market Close Today March 12th 2024

Stock Market Today March 12th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

Stock Market Today March 12th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బ్యాంకింగ్, టెక్ సెక్టార్లు రాణిస్తుండడం సహా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలపరుస్తోంది.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 388 పాయింట్లు లాభపడి 73,891 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 85 పాయింట్లు వృద్ధి చెంది 22,418 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టీసీఎస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఇన్ఫోసిస్​​, ఐసీఐసీఐ బ్యాంక్​, యాక్సిస్​ బ్యాంక్​, టెక్ మహీంద్రా
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఐటీసీ, నెస్లే ఇండియా, ఎన్​టీపీసీ, టాటా స్టీల్​, పవర్​గ్రిడ్​, ఎస్​బీఐ

Indigo Shares :
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ 'ఇండిగో' సహ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ అయిన రాకేశ్​ గంగ్వాల్, కంపెనీలోని తన షేర్​ హోల్డింగ్​ను భారీగా తగ్గించుకున్నారు. సోమవారం 5.83 శాతం వాటాను ఓపెన్ మార్కెట్లో అమ్మేశారు. దీని మొత్తం విలువ సుమారుగా రూ.6,785 కోట్లు ఉంటుంది.

విభేదాలే కారణం!
ఇండిగో కార్పొరేట్ గవర్నెన్స్​ విషయంలో సహ వ్యవస్థాపకుడు రాహుల్​ భాటియాతో రాకేశ్​ గంగ్వాల్​కు విభేదాలు వచ్చాయి. దీనితో కంపెనీలోని తన షేర్ హోల్డింగ్స్​ను తగ్గించుకుంటానని ఫిబ్రవరిలోనే రాకేశ్ గంగ్వాల్ ప్రకటించారు.

బీఎస్​ఈ బల్క్​ డీల్​ డేటా ప్రకారం, రాకేశ్ గంగ్వాల్​ 2.25 కోట్ల షేర్లను మూడు విడతలుగా విక్రయించారు. వీటిని రూ.3,015.10 నుంచి రూ.3,016.36 ప్రైస్​ రేంజ్​లో అమ్మేశారు. వాస్తవానికి ఈ ఇండిగో షేర్ వాల్యూ బీఎస్​ఈలో రూ.3,214.25గా ఉంది. కానీ రాకేశ్​ వాటిని డిస్కౌంట్ ప్రైస్​లోనే అమ్మేయడం గమనార్హం.

రూపాయి విలువ
Rupee Open March March 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.76గా ఉంది.

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో హాంకాంగ్​, సియోల్ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. టోక్యో, షాంఘై మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సోమవారం యూఎస్ మార్కెట్లు మిక్స్​డ్ నోట్​తో ముగిశాయి.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం, సోమవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.4,212 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు.

ముడిచమురు ధర
Crude Oil Prices March 12th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.35 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.50 డాలర్లుగా ఉంది.

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

PPF, SSY ఖాతాదారులకు అలర్ట్​ - కనీస మొత్తం జమ చేయడానికి డైడ్​లైన్​ ఇదే!

Last Updated :Mar 12, 2024, 10:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.