ETV Bharat / business

మోడ్రన్​ లుక్​లో నెక్ట్స్​-జెన్​ 'మారుతి స్విఫ్ట్'​ - బిగ్​ టచ్ స్క్రీన్, 6 ఎయిర్​ బ్యాగ్స్​ ​కూడా - లాంఛ్ ఎప్పుడంటే? - Next Gen Maruti Swift Updates

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 5:15 PM IST

Next-Gen Maruti Swift Updates : మారుతి సుజుకి త్వరలో ఫోర్త్-జనరేషన్​ స్విఫ్ట్​ కారు లాంఛ్​ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ కారు డిజైన్​లోనూ పలు మార్పులు చేస్తోంది. ఈ నెక్ట్స్-జెన్​ స్విఫ్ట్​ కారులో బిగ్ టచ్​ స్క్రీన్​, 6-ఎయిర్​ బ్యాగ్స్​ సహా పలు సరికొత్త ఫీచర్లు పొందుపరిచినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం.

Next-gen Maruti Swift features
Next-gen Maruti Swift price

Next-Gen Maruti Swift Updates : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి త్వరలో నెక్ట్స్​-జెన్ స్విఫ్ట్ కారును లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతానికి ఈ కారును YED అనే కోడ్​ నేమ్​తో పిలుస్తోంది. ఈ అప్​కమింగ్ స్విఫ్ట్ కారులో పలు ఎక్స్​టీరియర్, ఇంటీరియర్​ మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

Next-gen Maruti Swift Features : గ్లోబర్-స్పెక్ మారుతి​ స్విఫ్ట్ కారులోని ఫీచర్లు ఇవే!

  • ఎల్​ఈడీ హెడ్​లైట్స్​ & టెయిల్ లైట్స్​
  • ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​
  • 16 అంగుళాల అల్లాయ్​ వీల్స్​
  • ఆటోమేటిక్​ క్లైమేట్ కంట్రోల్​
  • ఎలక్ట్రికల్లీ అడ్జెస్టబుల్​ అండ్ ఫోల్డబుల్​ వింగ్ మిర్రర్స్
  • ఆటో హెడ్​ల్యాంప్స్​
  • 9 అంగుళాల టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్మెంట్​ సిస్టమ్
  • వైర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే
  • ఆండ్రాయిడ్​ ఆటో

Next-gen Maruti Swift Safety Features : ఈ నెక్ట్స్​-జెన్​ మారుతి స్విఫ్ట్ కారులో చాలా సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అవి ఏమిటంటే?

  • 6-ఎయిర్​ బ్యాగ్స్​
  • టైర్ ప్రెజర్ మోనిటర్
  • ఏబీఎస్​ విత్​ ఈబీడీ
  • బ్రేక్ అసిస్ట్​
  • ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ ప్రోగ్రామ్​
  • హిల్​ హోల్డ్ కంట్రోల్​

ADAS Features​ :

  • లేన్ కీపింగ్​ అసిస్ట్​
  • బ్లైండ్ స్పాట్ మోనిటర్​
  • అడాప్టివ్​ క్రూయిజ్​ కంట్రోల్​
  • లేన్​ డిపార్చర్​ వార్నింగ్​ అండ్ ప్రివెన్షన్​. అయితే ఈ ADAS ఫీచర్స్ అన్నీ ఇండియన్-స్పెక్​లో ఉంటాయా? లేదా? అనేది చూడాలి.

మోడ్రన్​ స్టైలిష్ లుక్​
Next-gen Maruti Swift Design : మారుతి సుజుకి కంపెనీ ఇప్పటికే జపాన్, యూరోప్​ల్లో ఈ నెక్ట్స్​-జెన్ సిఫ్ట్ కారును విడుదల చేసింది. దీనిని బట్టి ఇండియన్-స్పెక్​ మోడల్​ ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. విదేశాల్లో విడుదల చేసిన మారుతి సుజుకి స్విఫ్ట్ కారును చూస్తే, డిజైన్​లో విప్లవాత్మకమైన మార్పులు ఏమీ చేయలేదని స్పష్టంగా తెలుస్తుంది. అంటే దీని డిజైన్ ఫిలాసఫీలో ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ మోడ్రన్ లుక్ వచ్చేలా తీర్చిదిద్దారు.

ఈ అప్​కమింగ్ స్విఫ్ట్ కారు పాత మోడల్​ కంటే 15 mm పొడవుగా, 40 mm ఇరుకుగా , 30mm ఎత్తుగా ఉంటుంది. దీని వీల్ బేస్ మాత్రం​ 2450 mm గానే ఉంది.

Next-gen Maruti Swift Launch Date : మారుతి సుజుకి కంపెనీ ఈ కొత్త తరం స్విఫ్ట్ కారును మరికొద్ది నెలల్లో విడుదల చేసే అవకాశం ఉంది. కంపెనీ మాత్రం లాంఛ్ డేట్​పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే కనుక విడుదలైతే హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​, టాటా టియాగోలకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం.

Next-gen Maruti Swift Price : ప్రస్తుతం మారుతి స్విఫ్ట్ కారు ధర సుమారుగా రూ.5.99 లక్షల నుంచి రూ.9.03 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉంది. అయితే అప్​కమింగ్ హ్యాచ్​బ్యాక్ ధర మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

రూ.6 లక్షల బడ్జెట్లో మంచి కారు కొనాలా? టాప్​-5 మోడల్స్ ఇవే! - Best Cars Under 6 Lakh

రూ.70వేలు బడ్జెట్లో మంచి టూ-వీలర్​ కొనాలా? టాప్​-10 బైక్స్ & స్కూటీస్ ఇవే! - Best Bikes Under 70000

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.