ETV Bharat / business

బీ అలర్ట్​ - ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి న్యూ ట్యాక్స్​ రూల్స్​! - NEW TAX RULES 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 5:22 PM IST

New Income Tax Rules From April 1 : కొత్త ఆర్థిక సంవత్సరంలో న్యూ ట్యాక్స్ రూల్స్ అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా కొత్త పన్ను విధానం, ట్యాక్స్ స్లాబ్స్​, రిబేట్స్​, డిడక్షన్స్ మారనున్నాయి. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

New Tax Rules To Come Into Effect From 2024 April 1st
Key Income Tax Changes From April 1st 2024

New Income Tax Rules From April 1st 2024 : పన్ను చెల్లింపుదారులకు అలర్ట్​. నూతన ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం అమల్లోకి రానుంది. ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్స్​, రిబేట్స్​, డిడక్షన్స్ మారనున్నాయి. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అమల్లోకి కొత్త పన్ను విధానం
New Tax Regime Default Adoption : 2024-25 ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానం డీఫాల్ట్‌గా అమలులోకి రానుంది. ఐటీఆర్ ఫైలింగ్​ను క్రమబద్ధీకరించడం, ప్రజలు సక్రమంగా పన్ను చెల్లించేలా ప్రోత్సహించడమే దీని ప్రధాన లక్ష్యం. ఒక వేళ మీకు కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా లేకపోతే, పాత పన్నుల విధానాన్నే అనుసరించే స్వేచ్ఛ ఉంటుంది.

పన్ను రిబేట్​
Elevated Basic Exemption Limit And Rebate : 2023 ఏప్రిల్ 1 నుంచి ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచారు.​ అయితే ఆదాయపు పన్ను చట్టం-1961లోని సెక్షన్​ 87A ప్రకారం, ఈ పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి రూ.7 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అందరూ పూర్తి పన్ను రాయితీని పొందనున్నారు. అంటే వీరు ప్రభుత్వానికి ఎలాంటి ఇన్​కమ్​ ట్యాక్స్​ కట్టాల్సిన అవసరం ఉండదు.

2024-25 కొత్త ట్యాక్స్​ స్లాబ్స్​ ఇలా ఉంటాయి

  • రూ.3 లక్షల నుంచి 6 లక్షల ఆదాయం పొందే వారిపై 5% పన్ను విధిస్తారు.
  • రూ.6 లక్షల నుంచి రూ.9 లక్షల ఆదాయం పొందే వారిపై 10%.
  • రూ.9 లక్షల నుంచి రూ.12 లక్షల ఆదాయం పొందే వారిపై 15%.
  • రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయం పొందే వారిపై 20%.
  • రూ.15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయం పొందే వారిపై 30% ట్యాక్స్​ను విధిస్తారు.

బేసిక్​ డిడక్షన్​ పునరుద్ధరణ
Restoration Of Basic Deduction : రూ.50,000 స్టాండర్డ్​ డిడక్షన్​ పాత పన్ను విధానంలో ఉంది. దీనిని కొత్త పన్ను విధానంలోనూ చేర్చారు. కనుక 2024 ఏప్రిల్​ 1 నుంచి కొత్త పన్ను విధానంలోనూ ఈ బేసిక్ డిడక్షన్ జరుగుతుంది. దీని వల్ల పన్ను చెల్లింపుదారులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది.

తగ్గనున్న సర్​ఛార్జీ
Reduced Surcharge : రూ.5 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించేవారిపై ఇప్పటి వరకు 37 శాతం సర్​ఛార్జీ విధిస్తూ వస్తున్నారు. అయితే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ఈ సర్​ఛార్జీని 25 శాతానికి తగ్గించారు. ఇది కూడా ఏప్రిల్​ 1 నుంచే అమల్లోకి రానుంది.

జీవిత బీమాపై ట్యాక్స్​
Life insurance Taxation : 2023 ఏప్రిల్ 1 లేదా ఆ తర్వాత జారీ చేసిన జీవిత బీమా పాలసీలకు సంబంధించి ప్రీమియం మొత్తం రూ.5 లక్షలకు మించి ఉంటే పన్ను విధిస్తారు.

పెరిగిన లీవ్​ ఎన్‌క్యాష్‌మెంట్​ ట్యాక్స్​ లిమిట్​
Exemption Of Enhanced Leave Encashment : ప్రభుత్వేతర ఉద్యోగులకు లీవ్​ ఎన్‌క్యాష్‌మెంట్​ పన్ను మినహాయింపు పరిమితి 2022 నుంచి రూ.3 లక్షలుగా ఉంది. ఈ ఏప్రిల్ 1​ నుంచి దీనిని రూ.25 లక్షలకు పెంచనున్నారు. ఇది ప్రైవేట్ రంగ ఉద్యోగులకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది.

క్రెడిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్ ​- ఏప్రిల్‌ 1 నుంచి మారనున్న రూల్స్​! - Credit Card Rules From April 2024

గోల్డ్ ఇన్వెస్ట్​మెంట్స్ చేయాలా? ఈ టాప్​-3 ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి! - Gold Investment Tips For Women

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.