ETV Bharat / business

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 9:22 AM IST

Updated : Jan 31, 2024, 10:32 AM IST

Gold Price Today 31st January 2024
Gold Rate Today 31st January 2024

Gold Rate Today 31st January 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 31st January 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,603గా ఉండగా, బుధవారం నాటికి రూ.29 తగ్గి రూ.64,574కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.73,915 ఉండగా, బుధవారం నాటికి రూ.169 తగ్గి రూ.73,746కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 31st January 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.
  • Gold Price In Vijayawada 31st January 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 31st January 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.
  • Gold Price In Proddatur 31st January 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,574గా ఉంది. కిలో వెండి ధర రూ.73,746గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 31st January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్, సిల్వర్​ రేట్లు దాదాపు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2032 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 2 డాలర్లు​ పెరిగి 2034 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.08 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 31st January 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.35,63,994
ఇథీరియం రూ.1,94,483
టెథర్రూ.83.9
బైనాన్స్ కాయిన్ రూ.25,505
యూఎస్​డీ కాయిన్ రూ.83.12

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today 31st January 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. కానీ తరువాత కోలుకుని లాభాలబాట పట్టాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 130 పాయింట్లు లాభపడి 71,270 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 48 పాయింట్లు వృద్ధి చెంది 21,570 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : టాటా మోటార్స్​, రిలయన్స్​, ఆల్ట్రాటెక్​ సిమెంట్​, ఎం అండ్ ఎం, హెచ్​సీఎల్​ టెక్​, మారుతి సుజుకి
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఎల్​ అండ్ టీ, కోటక్ బ్యాంక్​, టైటాన్​, పవర్​గ్రిడ్​, ఇన్ఫోసిస్​, ఏసియన్ పెయింట్స్​

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. యూఎస్ ఫెడ్ కూడా త్వరలో కీలక వడ్డీ రేట్లు ప్రకటించనుంది. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

రూపాయి విలువ
Rupee Open 31st January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.12గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 31st January 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ముడిచమురు ధర
Crude Oil Prices 31st January 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.45 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.50 డాలర్లుగా ఉంది.

ఈసారి బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వే ఉంటుందా? మోదీ సర్కార్ వ్యూహం ఏమిటి?

అయోధ్య యాత్రికులకు Paytm బంపర్ ఆఫర్​ - బస్, ఫ్లైట్​ బుకింగ్స్​పై 100% క్యాష్ బ్యాక్​!

Last Updated :Jan 31, 2024, 10:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.