ETV Bharat / business

పెరిగిన బంగారం, వెండి ధరలు- ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 2, 2024, 9:47 AM IST

Updated : Feb 2, 2024, 10:14 AM IST

Gold Rate Today 2nd February 2024
Gold Rate Today 2nd February 2024

Gold Rate Today 2nd February 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate Today 2nd February 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. గురువారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,750గా ఉండగా, శుక్రవారం నాటికి రూ.230 పెరిగి రూ.64,980కు చేరుకుంది. గురువారం కిలో వెండి ధర రూ.73,700ఉండగా, శుక్రవారం నాటికి రూ.78 పెరిగి రూ.73,778కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad 2nd February 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది.
  • Gold Price In Vijayawada2nd February 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam 2nd February 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,778గా ఉంది.
  • Gold Price In Proddatur 2nd February 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,980గా ఉంది. కిలో వెండి ధర రూ.73,700గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price 2ndFebruary 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో గోల్డ్ రేట్లు స్వల్పంగా పెరిగాయి. గురువారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర 2046 డాలర్లు ఉండగా, శుక్రవారం నాటికి 9 డాలర్లు​ పెరిగి 2055 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 23.15 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News 2nd February 2024 : శుక్రవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్ రూ.35,65,406
ఇథీరియంరూ.1,90,715
టెథర్రూ.82.85
బైనాన్స్ కాయిన్రూ.25,045
యూఎస్​డీ కాయిన్రూ.82.89

స్టాక్​మార్కెట్​ అప్​డేట్స్
Stock Market Today 2nd February 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో సానుకూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు శుక్రవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 843 పాయింట్లు లాభపడి 72,488 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 248 పాయింట్లు ఎగబాకి 21,946 వద్ద కొనసాగుతున్నాయి.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, పవర్​గ్రిడ్​, టెక్​ మహీంద్రా, రిలయన్స్, ఎన్​టీపీసీ, విప్రో, టీసీఎస్​, హెచ్​సీఎల్​ టెక్​, అల్ట్రాటెక్​ సిమెంట్స్​, భారతీ ఎయిర్​టెల్​, జేఎస్​డబ్లూ స్టీల్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఎల్​అండ్​టీ, మారుతీ

రూపాయి విలువ
Rupee Open 2nd February 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 11 పైసలు బలపడింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.87గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices 2nd February 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.66గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

పేటీఎంపై ఆర్​బీఐ ఆంక్షలు - మరి ఖాతాదారుల డబ్బు సేఫేనా? లోన్స్ పరిస్థితి ఏమిటి?

ఊరట ఇవ్వని కేంద్ర బడ్జెట్! పన్ను విధానంలో మార్పుల్లేవ్!

Last Updated :Feb 2, 2024, 10:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.