ఫైనాన్సియల్ డెడ్​లైన్స్​ - మార్చి 31లోగా ఇవి పూర్తి చేయాల్సిందే! - Financial Deadlines In March 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 11:43 AM IST

Money Deadlines And Changes In March 2024

Financial Deadlines In March 2024 : మరో 2 రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అందువల్ల మార్చి 31లోపు ఐటీఆర్​ ఫైలింగ్​, ఫాస్టాగ్​ అప్​డేట్​, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్​మెంట్స్​ చేసుకోవడం చాలా మంచిది. గడువులోగా వాటిని పూర్తి చేయకపోతే, తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Financial Deadlines In March 2024 : మరికొద్ది రోజుల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగియనుంది. అందువల్ల మార్చి 31లోపు ఐటీఆర్​ ఫైలింగ్​, ఫాస్టాగ్​ అప్​డేట్​, ట్యాక్స్ సేవింగ్ ఇన్వెస్ట్​మెంట్స్​ చేసుకోవడం చాలా మంచిది. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1. ఆదాయ పన్ను రిటర్నులు : 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, సవరించిన ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి గడువు 2024 మార్చి 31. కనుక సదరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైన పన్ను చెల్లింపుదారులు, సవరించిన ఐటీఆర్​ను లేదా ఐటీఆర్​-యూను మార్చి 31లోపు సమర్పించుకోవచ్చు.

ఆదాయపు పన్ను షరతులు పాటించినట్లయితే, సంబంధిత అసెస్​మెంట్ సంవత్సరం ముగిసినప్పటి నుంచి రెండేళ్లలోపు అప్​డేట్​ చేసిన ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ ​చేసుకునే వెసులుబాటు ఉంది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐటీఆర్​ ఫైల్​ చేయనివారు ఈ మార్చి 31 లోపు దానిని దాఖలు చేయవచ్చు.

2. ఫాస్టాగ్​ అప్​డేట్​ : ఫాస్టాగ్​ వినియోగదారులు ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, నేషనల్​ హైవే ఆథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్టాగ్​ అప్డేట్​ కోసం 2024 మార్చి 31 వరకు గడువు పొడిగించింది. కనుక ఫాస్టాగ్ వినియోగదారులు ఈ గడువులోగా కేవైసీ (Know Your Customer) పూర్తి చేసుకోవాలి.

3. ట్యాక్స్​ సేవింగ్​ ఇన్వెస్ట్​మెంట్లు : ట్యాక్స్​ సేవింగ్​ ఇన్వెస్ట్​మెంట్లు చేసేందుకు మార్చి​ 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఈ తేదీలోగా ఇన్వెస్ట్​మెంట్లు చేస్తే, పన్ను ఆదా కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన (SSY), పబ్లిక్‌ ప్రావిడెంట్​ ఫండ్‌ (PPF) స్కీమ్స్​లో మదుపు చేస్తున్నవారు, ఈ ఏడాది మార్చి 31లోపు ఈ పథకాల్లో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. లేదంటే సదరు ఖాతాలు స్తంభించిపోతాయి. తరువాత ఆ అకౌంట్​లు పునరుద్ధరణ చేసుకోవాలంటే, జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. పైగా పలు ప్రయోజనాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది.

  • Public Provident Fund : ప‌బ్లిక్ ప్రావిడెంట్​ ఫండ్ అకౌంట్​లో​ ప్రతి సంవత్సరం కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు జమ చేయవచ్చు. ఒకవేళ గడువులోగా కనీస మొత్తం జమ చేయకపోతే ఖాతా స్తంభించిపోతుంది. తిరిగి ఖాతా పునరుద్ధరణ చేయాలంటే, రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా పీపీఎఫ్‌ అకౌంట్​ తెరిచిన మూడో సంవత్సరం నుంచి రుణం తీసుకోవచ్చు. ఆరో సంవత్సరం నుంచి నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. ఒక వేళ అకౌంట్‌ స్తంభించిపోతే ఈ లోన్‌, విత్‌డ్రా సదుపాయాలను కోల్పోవాల్సి వస్తుంది. ఒకవేళ స్తంభించిన పీపీఎఫ్‌ ఖాతాను పునరుద్ధరించాలంటే, జరిమానా రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి రూ.550 చొప్పున చెల్లించాల్సి వస్తుంది.
  • Sukanya Samriddhi Yojana : కేంద్ర ప్రభుత్వం ఆడ‌పిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన పథకమే సుక‌న్య సమృద్ధి యోజన. ఈ పథకంలో ఏటా కనిష్ఠంగా రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. కనీస మొత్తం జమ చేయకపోతే అకౌంట్​ స్తంభించిపోతుంది. మళ్లీ రూ.50 జరిమానా చెల్లించి ఖాతాను పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. అంటే కనీస డిపాజిట్‌ మొత్తం + జరిమానా రూ.50 కలిపి చెల్లించాల్సి వస్తుంది. ఏదైనా కారణంతో ఖాతాను పునరుద్ధరించకపోతే, ఖాతాలోని మొత్తం డబ్బు మెచ్యూరిటీ తరువాత మాత్రమే తీసుకోవడానికి వీలవుతుంది. ఎస్‌ఎస్‌వై ఖాతా తెరిచిన 21 ఏళ్ల తర్వాత లేదా అమ్మాయికి 18 ఏళ్లు వచ్చిన తరువాత ఈ అకౌంట్‌ మెచ్యూర్ అవుతుంది.
  • Amrith Kalash Scheme Deadline : మనదేశంలోని అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తమ కస్టమర్ల కోసం 'అమృత్ కలశ్' పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో చేరడానికి ఆఖరు తేదీ 2024 మార్చి 31. ఎస్​బీఐ 2023 ఫిబ్రవరి 15న అమృత్ కలశ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇది ఒక ప్రత్యేకమైన ఫిక్స్​డ్ డిపాజిట్ స్కీమ్​. దీని కాలపరిమితి 400 రోజులు మాత్రమే. ఎస్​బీఐ ఈ స్కీమ్​ ద్వారా ఆకర్షణీయమైన వడ్డీ రేట్లను అందిస్తోంది. సాధారణ పౌరులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు ఏకంగా 7.60 శాతం వరకు వడ్డీ అందిస్తుంది. అంటే సీనియర్ సిటిజన్లు ఈ అమృత్​ కలశ్​ పథకం ద్వారా అధిక లబ్ధి పొందుతారు. 2023 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకాన్ని మార్చి 31 వరకే అందుబాటులో ఉంచాలని నిర్ణయించుకున్నారు. కానీ వినియోగదారుల నుంచి మంచి స్పందన రావడంతో రెండు సార్లు ఈ పథకం​ గడువును పెంచారు. ఈ పథకంలో గరిష్ఠంగా రూ.2 కోట్ల వరకు డిపాజిట్ చేయవచ్చు. ప్రవాస భారతీయులు కూడా ఈ స్కీమ్​లో చేరడానికి అర్హులే. ఈ పథకంలో చేరినవారు వడ్డీ చెల్లింపునకు నెల, ఆరు నెలల, లేదా సెమీ యాన్యువల్ కాలవ్యవధులను ఎంచుకోవచ్చు. దీని ఆధారంగా నగదు మీ ఖాతాలో జమ అవుతుంది. అయితే ఇన్​కమ్​ టాక్స్ చట్టం ప్రకారం, ఈ పథకం కింద వచ్చిన ఆదాయంపై టీడీఎస్ కట్ అవుతుంది. ఈ అమృత్​ కలశ్​ పథకంలో రుణం సదుపాయంతోపాటు, ముందే డబ్బులు విత్​డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
  • ఎలక్ట్రిక్ వాహనం లోన్‌పై వడ్డీ చెల్లింపులు
    ఎలక్ట్రిక్ వాహనాన్ని లోన్‌పై కొన్నవారు కూడా పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. అయితే 2019 ఏప్రిల్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్యకాలంలో ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారు ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 80EEB కింద పన్ను ప్రయోజనం పొందేందుకు అర్హులు. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు లోన్ వడ్డీ చెల్లింపులపై ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఈ వడ్డీని పన్ను చెల్లింపుదారుడు క్లెయిమ్ చేసుకోవచ్చు. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొన్న వారంతా ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు.
  • ప్రధానమంత్రి వయ వందన యోజన
    ప్రధానమంత్రి వయ వందన యోజన(PMVVY) స్కీం ఎన్‌రోల్‌మెంట్ కోసం మార్చి 31 వరకు అవకాశం ఉంది. ఈ స్కీంలో సీనియర్ సిటిజన్లు ఒకసారి పెట్టుబడి పెడితే స్థిరమైన ఆదాయం లభిస్తుంది. 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన వ్యక్తులు ఈ పథకానికి అర్హులు. ప్రస్తుతం ఈ స్కీంలో పెట్టే పెట్టుబడులకు 7.4 శాతం వార్షిక వడ్డీని చెల్లిస్తారు. PMVVY స్కీం 10 సంవత్సరాల మెచ్యూరిటీ పీరియడ్‌ను కలిగి ఉంటుంది.

4. వీటికి మరో రెండు రోజులే ఛాన్స్​!

  • మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నవారు కచ్చితంగా మార్చి 31లోపు రీ-కేవైసీ పూర్తి చేయాలి.
  • బ్యాంకు ఖాతాలు ఉన్నవారు (ఆధార్, పాన్ కార్డ్ లింక్ చేయకుండా ఉంటే) మార్చి 31లోపు కేవైసీని అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • సొంతిల్లు కొనాలనుకునే వారికి పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకూ లోన్స్ అందిస్తున్నాయి. కనుక ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవడం మంచిది.

తొలిసారి చేతులు కలిపిన అంబానీ, అదానీ- 20 ఏళ్లకు అగ్రిమెంట్- ఏ ప్రాజెక్ట్ అంటే? - Ambani Adani Collaboration

హోమ్ లోన్ తీర్చేందుకు EPF ఫండ్స్​ వాడుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి! - PF Withdrawal For Home Loan

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.