ETV Bharat / business

IPO భూమ్​ - సచిన్​కు 12 రెట్లు లాభం - ఆలియా భట్​కు 11 రెట్లు - ఎలా సంపాదించారంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 5:01 PM IST

cricket Stars In The Stock Market
Cinema Stars In The Stock Market

Cinema Stars In Indian Stock Market : దేశంలో ఐపీఓ భూమ్ నడుస్తోంది. ప్రముఖ సినీ, క్రికెట్ స్టార్లు ఐపీఓల్లో బిడ్డింగ్ వేసి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. వారిలో క్రికెడ్ దేవుడు సచిన్ తెందూల్కర్​, బాలీవుడ్ సినీ ప్రముఖులు ఆలియా భట్​, శిల్పా శెట్టి, కత్రినా కైఫ్​, అజయ్ దేవ్​గణ్​, అమీర్​ఖాన్​, రణ్​బీర్ కపూర్​ తదితరులు ఉన్నారు. ఇంతకూ వీరు ఏయే స్టాక్స్​లో పెట్టుబడులు పెట్టారంటే?

Cinema Stars In Indian Stock Market : సినిమా, క్రికెట్ స్టార్లను మనం టీవీలో చూసి ఆనందిస్తూ ఉంటాం. వాళ్లు కేవలం సినిమాలకు, ఆటలకు మాత్రమే పరిమితం అవుతారని అనుకుంటాం. కానీ వాళ్లు సినిమాలు, క్రికెట్​లో మాత్రమే కాదు, స్టాక్ మార్కెట్లోనూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. భారీ లాభాలు ఆర్జిస్తున్నారు. వారిలో ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ ఉన్నారు. అలాగే బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్​, శిల్పా శెట్టి, కత్రినా కైఫ్​, అజయ్ దేవ్​గణ్​, అమీర్​ఖాన్​, రణ్​బీర్ కపూర్ తదితరులు ఉన్నారు.

ఐపీఓ భూమ్​
భారతదేశంలో కొవిడ్-19 తరువాత స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. ముఖ్యంగా 2020 తరువాత నుంచి మన దేశంలో 'ఐపీఓ మార్కెట్​' భూమ్​ మొదలైంది. ఐపీఓలో బిడ్డింగ్ వేసి, షేర్లు పొందిన వారిలో మెజారిటీ ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. వీరిలో సినీ, క్రికెట్ స్టార్లు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఎవరెవరు ఏయే ఐపీఓ/ స్టాక్స్​లో ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

1. డ్రోన్ ఆచార్య ఏరియల్​ ఇన్నోవేషన్స్​ : ప్రముఖ బాలీవుడ్ హీరోలు అమీర్​ఖాన్​, రణబీర్​ కపూర్​లు డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్​లో పెట్టుబడులు పెట్టి, లిస్టింగ్​లో భారీ లాభాలను సంపాదించారు.

వాస్తవానికి అమీర్​ఖాన్ ప్రీ-ఐపీఓ రౌండ్​లో 46,000 షేర్లు (0.26 శాతం వాటా)ను రూ.25 లక్షలకు కొనుగోలు చేశారు. రణబీర్ కపూర్​ 37,200 షేర్లు (0.21 శాతం వాటా)ను రూ.20 లక్షలకు తీసుకున్నారు. అంటే ప్రీ-ఐపీఓలో వీరికి ఒక్కో షేరు దాదాపుగా రూ.53.59లకు వచ్చింది.

డ్రోన్ ఆచార్య ఏరియల్ ఇన్నోవేషన్​ 2022 డిసెంబర్​ 23న స్టాక్​ మార్కెట్లో రూ.102 ఓపెనింగ్ ప్రైజ్​తో లిస్ట్​ అయ్యింది. 2024 మార్చి 7వ తేదీన ఈ స్టాక్ రూ.155.85 ధర వద్ద క్లోజ్ అయ్యింది. అంటే ఈ స్టాక్​ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసినవారికి 45.52 శాతం మేర లాభాలను అందించింది. ఈ లెక్కన అమీర్​ఖాన్​ రూ.72.62 లక్షలు, రణబీర్ కపూర్​ రూ.57.97 లక్షలు సంపాదించారు. అంటే వారు ఇన్వెస్ట్ చేసిన దానికి (సుమారుగా) మూడు రెట్లు లాభాలు ఆర్జించారు.

2. ఆజాద్​ ఇంజినీరింగ్​ : భారతీయులు ప్రేమగా క్రికెట్ దేవుడు, క్రికెట్ మాస్ట్రో అని పిలుచుకునే సచిన్ తెందూల్కర్ కూడా స్టాక్ మార్కెట్లో తన సత్తా చాటారు. ఆజాద్ ఇంజినీరింగ్ ప్రీ-ఐపీఓలో 4,38,120 షేర్లను రూ.114.10 యావరేజ్ ప్రైజ్​తో ఆయన కొనుగోలు చేశారు. అంటే ఆయన 2023 మార్చిలో ఆజాద్​ ఇంజినీరింగ్​ ప్రీ-ఐపీఓలో రూ.4.99 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

ఆజాద్​ ఇంజినీరింగ్​ షేర్లు 2023 డిసెంబర్​ 28న రూ.720 ఓపెనింగ్ ప్రైజ్​తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఈ 2024 మార్చి 7 నాటికి ఈ షేర్ ధర రూ.1355.30 వద్ద క్లోజ్ అయ్యింది. దీని ప్రకారం, సచిన్ తెండూల్కర్ ప్రస్తుతం రూ.59.39 కోట్లు సంపాదించినట్లు లెక్క. అంటే ఆయన ఇన్వెస్ట్ చేసిన దానికంటే 12 రెట్లు అధికంగా లాభం పొందారు.

3. నైకా : బాలీవుడ్ భామలు ఆలియా భట్, కైత్రినా కైఫ్​ కూడా స్టాక్​ మార్కెట్లో తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆసియా భట్​ 2020 జులైలో రూ.4.95 కోట్లు పెట్టి నైకా షేర్లను కొనుగోలు చేసింది. అయితే ఫల్గుణి నాయర్ నేతృత్వంలోని ఈ కంపెనీ 2021 నవంబర్​ 10న రూ.2,129 ఓపెనింగ్​ ప్రైజ్​తో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యింది. తరువాత 2022 అక్టోబర్​లో కంపెనీ 1:5 బోనస్ షేర్లను అనౌన్స్ చేసింది. 2024 మార్చి 7న నైకా షేర్​ రూ.156.5 వద్ద స్థిరపడింది. ఈ విధంగా షార్ట్​ టర్మ్​లోనే ఆలియాభట్ సంపద 11 రెట్లు పెరిగింది. అంటే రూ.4.95 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే, ఆలియా భట్​కు రూ.54 కోట్లు వచ్చాయి.

కత్రినా కైఫ్ 2018లో​ నైకా జాయింట్ వెంచర్ అయిన కేకే బ్యూటీలో రూ.2.04 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 2021 నంబర్​ 10న నైకా కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన వెంటనే, ఆమెకు 11 రెట్లు లాభం వచ్చింది. అంటే రూ.2.04 కోట్లు పెట్టుబడి పెడితే, రూ.22 కోట్లు లాభం వచ్చింది.

4. మామాఎర్త్​ : బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఒక్కో షేరుకు రూ.41.86 చొప్పున చెల్లించి 16 లక్షల మామాఎర్త్ షేర్లను కొనుగోలు చేసింది. వీటిలో 13.96 లక్షల షేర్లను ఆఫర్​ ఫర్ సేల్​ (ఓఎఫ్ఎస్​)లో అమ్మేసింది. దీని వల్ల శిల్పాశెట్టికి ఏకంగా రూ.45.14 కోట్ల మేర లాభం వచ్చింది. పైగా ఇప్పటికీ మామాఎర్త్ కంపెనీలో ఆమెకు 2.3 లక్షల షేర్లు ఉన్నాయి.

5. పనోరమ స్టూడియోస్​ ఇంటర్నేషనల్​ : బాలీవుడ్ హీరో అజయ్ దేవ్​గణ్​ పనోరమ స్టూడియోస్​లో ఇన్వెస్ట్ చేసి భారీ లాభాలను ఆర్జించారు. ఆయన ప్రిఫరెన్సియల్ ఇష్యూలో (ప్రీ-ఐపీఓ కాదు) ఒక్కో షేరుకు రూ.274 చొప్పున చెల్లించి, ఒక లక్ష షేర్లు కొన్నారు. అంటే ఆయన రూ.2.74 కోట్లను ఈ షేర్లలో మదుపు చేశారు. ఇది ఒక వాల్యూ ఇన్వెస్ట్​మెంట్ అని చెప్పుకోవచ్చు. 2024 మార్చి 7న ఈ స్టాక్​ రూ.995 వద్ద క్లోజ్ అయ్యింది. దీనితో అజయ్​ దేవ్​గణ్​ ఇన్వెస్ట్​మెంట్ రూ.9.95 కోట్లకు పెరిగింది. అంటే ఆయన ఏకంగా 363.13 శాతం మేర లాభాలను గడించారు.

మహిళగా మీరు ఆర్థిక స్వేచ్ఛ సాధించాలా? ఈ బెస్ట్​ టిప్స్ మీ కోసమే!

రూ.కోటి ఉద్యోగం వదులుకుని 500మిలియన్ డాలర్ల బిజినెస్- ఎంతో మంది మహిళలకు ఉపాధి- ఎవరీ వినీతాసింగ్?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.