ETV Bharat / business

అదానీ చేతికి మరో పోర్టు - రూ.3,350 కోట్లకు డీల్​ ఫిక్స్​! - Adani acquire Odisha Gopalpur Port

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 12:54 PM IST

Adani acquire Odisha's Gopalpur Port
gautam adani

Adani Acquire Odisha's Gopalpur Port : అదానీ పోర్ట్స్‌ తాజాగా మరో పోర్టును కొనుగోలు చేసింది. ఎస్‌పీ గ్రూప్‌ నుంచి గోపాల్‌పూర్‌ నౌకాశ్రయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, గోపాల్​పుర్​ పోర్ట్​ను రూ.3,350 కోట్లకు అదానీ పోర్ట్స్​ కొనుగోలు చేసింది.

Adani Acquire Odisha's Gopalpur Port : అపర కుబేరుడు గౌతమ్ అదానీ చేతిలోకి మరో పోర్ట్ చేరింది. ఒడిశాలోని గోపాల్​పుర్ పోర్టును అదానీ పోర్ట్స్ అండ్ సెజ్​ లిమిటెడ్​ రూ.3,350 కోట్లకు కొనుగోలు చేసింది.

డబ్బు అవసరమై అమ్మేశాం!
గోపాల్‌పుర్‌ పోర్టును అదానీ పోర్ట్స్‌ అండ్‌ సెజ్‌ లిమిటెడ్‌కు విక్రయించినట్లు షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌ మంగళవారం ప్రకటించింది. తమ ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో భాగంగా రూ.3,350 కోట్లకు దీన్ని అమ్మివేసినట్లు తెలిపింది. ఒడిశాలోని ఈ గోపాల్‌పుర్‌ పోర్టు వార్షిక సామర్థ్యం 20 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు.

గతంలో అంటే 2017లో ఒడిశాలో నిర్మాణ దశలో ఉన్న ఈ నౌకాశ్రయాన్ని ఎస్‌పీ గ్రూప్‌ కొనుగోలు చేసింది. ఇటీవలే ఈ పోర్ట్​లో​ 'గ్రీన్‌ఫీల్డ్‌ ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్‌ టెర్మినల్‌' ఏర్పాటు కోసం 'పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జీ'తో ఒప్పందం చేసుకుంది కూడా.

ఈ గోపాల్​పుర్​ పోర్ట్​ దీర్ఘకాలంలో మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే గత కొన్ని నెలల్లో నౌకాశ్రయాల నుంచి ఎస్‌పీ గ్రూప్‌ పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటోంది. మొదటిసారిగా మహారాష్ట్రలోని ధరమ్‌తర్‌ పోర్టును రూ.710 కోట్లకు జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌కు విక్రయించింది. వాస్తవానికి దీన్ని 2015లో కొనుగోలు చేసి, దాని వార్షిక సామర్థ్యాన్ని 1 మిలియన్‌ టన్నుల నుంచి 5 మిలియన్‌ టన్నులకు పెంచింది. తాజాగా గోపాల్​పుర్ పోర్టును కూడా విక్రయించింది.

అప్పులు తగ్గించుకోవడానికే!
రుణాలను తగ్గించుకొని, కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి ఈ పెట్టుబడి ఉపసంహరణలు చాలా కీలకమని ఎస్‌పీ గ్రూప్‌ అధికార ప్రతినిధి తెలిపారు. దీని వల్ల భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఎస్​పీ గ్రూప్​కు ఉన్న కీలక వ్యాపారాలపై దృష్టి సారించే అవకాశం లభిస్తుందని ఆయన చెప్పారు. ఈ ఎస్​పీ గ్రూప్‌పై దాదాపు రూ.20 వేల కోట్ల రుణభారం ఉందని అంచనా.

అదానీ పోర్ట్స్​ అండ్ టెర్మినల్స్ లిస్ట్​!

  • గంగవరం పోర్ట్​ - ఆంధ్రప్రదేశ్​
  • కరైకల్​ పోర్ట్​ - పుదుచ్ఛేరి
  • కృష్ణపట్నం పోర్ట్​ - ఆంధ్రప్రదేశ్​
  • ముంద్రా పోర్ట్​ - గుజరాత్​
  • ట్యూనా టెర్మినల్​ - గుజరాత్​
  • దహేజ్​ పోర్ట్ - గుజరాత్​
  • హజీరా పోర్ట్ - గుజరాత్​
  • మోర్ముగో పోర్ట్​ - గోవా
  • విజింజిం పోర్ట్ - కేరళ
  • కట్టుపల్లి పోర్ట్ - తమిళనాడు
  • ఎన్నూర్ టెర్మినల్​ - తమిళనాడు
  • ధమ్రా పోర్ట్​ - ఒడిశా
  • దిఘీ పోర్ట్​ - మహారాష్ట్ర

బీ అలర్ట్​ - ఏప్రిల్​ 1 నుంచి అమల్లోకి న్యూ ట్యాక్స్​ రూల్స్​! - NEW TAX RULES 2024

2024 ఏప్రిల్ నెలలోని బ్యాంకు సెలవుల పూర్తి లిస్ట్ ఇదే! - Bank Holidays In April 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.