ETV Bharat / bharat

పాక్​కు కౌంటర్ ఇచ్చిన కశ్మీరీ జర్నలిస్ట్​కు ఎయిర్​పోర్ట్​లో అవమానం! క్లారిటీ ఇచ్చిన కస్టమ్స్​

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 12:26 PM IST

Updated : Feb 27, 2024, 12:44 PM IST

Yana Mir Delhi Airport : కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త, పాత్రికేయురాలు యానా మీర్ ఆరోపణలపై దిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం వివరణ ఇచ్చింది. తనిఖీలకు యానా మీర్ సహకరించలేదని చెప్పింది. అసలేమైందంటే?

Yana Mir Delhi Airport
Yana Mir Delhi Airport

Yana Mir Delhi Airport : బ్రిటన్​లో మలాలా యూసఫ్​ జాయ్​పై వ్యాఖ్యలు చేయడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన కశ్మీర్ మానవ హక్కుల కార్యకర్త, జర్నలిస్ట్ యానా మీర్​కు చేదు అనుభవం ఎదురైంది. తనను ఎయిర్​పోర్టులో కస్టమ్స్ సిబ్బంది విసిగించారని ఆమె ఆరోపించారు. అయితే యానా మీర్ చేసిన ఆరోపణలపై దిల్లీ విమానాశ్రయ కస్టమ్స్ విభాగం స్పందించింది. భద్రతా తనిఖీలకు యానా సహకరించలేదని తెలిపింది. అందుకు సంబంధించిన వీడియోలను కూడా పోస్ట్ చేసింది. అసలేం జరిగిందంటే?

'ఒక స్మగ్లర్​లా చూశారు!'
ఇటీవల లండన్‌లో జరిగిన సంకల్ప్ దివస్​ కార్యక్రమంలో డైవర్సిటీ అంబాసిడర్‌ అవార్డును అందుకున్నారు యానా మీర్. ఆ సందర్భంగా కశ్మీర్‌లో భద్రతపై బ్రిటన్‌ పార్లమెంట్‌లో ప్రసంగించి భారతీయుల మనసులను చూరగొన్నారు. ఇటీవల ఆమె భారత్​కు తిరిగివచ్చారు. ఆ సమయంలో దిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్‌ సిబ్బంది విసిగించారని ఆరోపించారు. విమానాశ్రయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఒక స్మగ్లర్​లా చూశారంటూ ఎక్స్​లో ట్వీట్ చేశారు.

'చెబుతున్న వినిపించుకోకుండా!'
తన వద్ద షాపింగ్ బ్యాగ్స్ ఉన్నాయని, వాటిని ఇంగ్లాండ్​లో తన బంధువులు ఇచ్చారని చెప్పారు యానా మీర్. అందుకే తన వద్ద రసీదు లేదని తెలిపారు. చెప్పినా వినకుండా తన లగేజీ అంతా ఎయిర్​ పోర్ట్ సిబ్బంది తెరిచారని ఆరోపించారు. దొంగతనం చేసి ఇక్కడికి ఎందుకు వచ్చానని అనుకుంటున్నారా? అని మీర్ ఓ మహిళా అధికారితో అన్నట్లు తెలుస్తోంది. అయితే యానా మీర్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో చాలా మంది నెటిజన్లు విమానాశ్రయ అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

'నిబంధనల ప్రకారమే అంతా'
అయితే యానా మీర్ ఆరోపణలపై దిల్లీ విమానాశ్రయ కస్టమ్స్‌ విభాగం వివరణ ఇచ్చింది. అంతర్జాతీయ ప్రయాణికుల లగేజ్‌ తనిఖీ అనేది సాధారణ ప్రక్రియ అని చెప్పింది. ఇదంతా నిబంధనల ప్రకారమే జరుగుతుందని పేర్కొంది. బ్యాగ్‌లను స్కాన్ చేసేందుకు యానా మీర్ సహకరించలేదని, ఇంతలో సిబ్బంది స్కానింగ్ మెషీన్​లో ఆమె బ్యాగ్ పెట్టారని చెప్పింది. ఆమెతో సిబ్బంది మర్యాదపూర్వకంగా ఉన్నారంటూ సీసీటీవీ దృశ్యాలను విడుదల చేసింది.

Last Updated :Feb 27, 2024, 12:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.