ETV Bharat / bharat

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం- ట్రక్కును ఢీకొట్టిన కారు- ఆరుగురు స్పాట్​ డెడ్ - UP Car Accident

author img

By ETV Bharat Telugu Team

Published : May 14, 2024, 9:33 AM IST

Updated : May 14, 2024, 9:50 AM IST

UP Hapur Car Accident : యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

UP car accident
UP Hapur 6 people died (ETV Bharat)

UP Hapur Car Accident : ఉత్తరప్రదేశ్​లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నేరుగా వెళ్లి ట్రక్కును ఢీ కొనడం వల్ల ఆరుగురు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. యూపీలోని బ్రజ్​ఘాట్​ టోల్​ ప్లాజా సమీపరంలో సోమవారం అర్థరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్​ కారుపై నియంత్రణ కోల్పోయి ట్రక్కును ఢీకొనడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని పోలీసులు మీరఠ్​లోని ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఎవరో తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నామని పోలీస్​ సూపరింటెండెంట్ అభిషేక్​ వర్మ తెలిపారు.

'ఏడుగురు వ్యక్తులు ఒక కారులో మొరాదాబాద్ నంచి దిల్లీ వైపు జాతీయ రహదారిపై వెళ్తున్నారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో ఘర్​ కొత్వాల్​ ప్రాంతంలో ఈ కారు అదుపు తప్పి డివైడర్​ను దాటిని వెళ్లి ఓ ట్రక్కును ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఆరుగురు వ్యక్తులు స్పాట్​లోనే మృతిచెందారు. ఒకరు మాత్రం తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీనితో పోలీసులు వచ్చి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. టైరు పగిలడం వల్లనే, కారు బ్యాలెన్స్​ తప్పి, ట్రక్కును ఢీకొని ఉండవచ్చని ప్రాథమికంగా తెలుస్తోంది' అని పోలీస్​ సూపరింటెండెంట్ అభిషేక్​ వర్మ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

కూలిన భారీ హోర్డింగ్- 14మంది మృతి, 74మందికి గాయాలు
మహారాష్ట్ర ముంబయిలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల దాటికి ఘాట్కోపర్‌ ప్రాంతంలో ఓ భారీ హోర్డింగ్ కుప్పకూలి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. ఈ ఘటనలో 14మంది మృతి చెందగా 70 మందికిపైగా గాయపడ్డారు. హోర్డింగ్ కింద అనేక మంది చిక్కుకుపోయారు. ఈ మేరకు అధికారులు మంగళవారం వివరాలు వెల్లడించారు.

అసలేం జరిగిందంటే?
సోమవారం సాయంత్రం దాదర్‌, కుర్లా, మాహిమ్‌, ఘాట్కోపర్‌, ములుంద్‌, విఖ్రోలితోపాటు దక్షిణ ముంబయిలో అనేక ప్రాంతాల్లో వర్షంతోపాటు, బలమైన గాలులు వీచాయి. చెడ్డా నగర్‌ జింఖానా ప్రాంతంలోని ఓ భారీ హోర్డింగ్‌ ఒక్కసారిగా కూలిపోయి పక్కనే ఉన్న పెట్రోల్‌ బంకుపై పడింది. సుమారు 100 మందికిపైగా దాని కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందిన వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక బృందాలు ఘటనా స్థలికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టాయి. అంబులెన్సులు, భారీ క్రేన్లు, గ్యాస్‌ కట్టర్లతో సహాయకు చర్యలు చేపట్టి పలువురిని రక్షించాయి. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు బృహన్ ముంబయి అధికారులు తెలిపారు. కూలిపోయిన హోర్డింగ్ కింద మరో 20-30 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామని BMC కమిషనర్ భూషణ్ గగ్రానీ తెలిపారు.

హ్యాట్రిక్​ లక్ష్యంగా వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ - హాజరైన అమిత్ షా, యోగి, చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ - PM Modi Nomination

'మరణించిన అమ్మాయికి తగిన వరుడు కావాలి- ఆసక్తి ఉన్న వాళ్లు సంప్రదించండి!' - Marriage Of Ghosts

Last Updated :May 14, 2024, 9:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.