సమ్మర్ స్పెషల్ పెరుగు పచ్చళ్లు - ఈజీగా ప్రిపేర్ చేసుకోండిలా - రుచితోపాటు ఆరోగ్యం బోనస్! - SUMMER SPECIAL CURD CHUTNEYS

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 20, 2024, 9:51 AM IST

Special Curd Chutneys
Special Curd Chutneys ()

Special Curd Chutneys : వేసవి కాలం అంటే పచ్చళ్ల కాలం. అయితే.. నిల్వ పచ్చళ్లు మాత్రమే కాకుండా.. ఈ వేడి నుంచి రిలీఫ్​ కోసం పెరుగుతో కూడా అద్దిరిపోయే చట్నీలు తయారు చేసుకుంటూ ఉంటారు. అందుకే మీ కోసం పెరుగుతో ప్రిపేర్ చేసుకునే స్పెషల్ చట్నీ రిసెపీస్​ తీసుకొచ్చాం. అవేంటో చూడండి..

Summer Special Curd Chutneys : సమ్మర్​లో చాలా మంది వేపుళ్లు, మసాలా కూరల్ని తగ్గించి పెరుగును ఎక్కువగా తీసుకుంటుంటారు. అయితే.. పెరుగులో పోషక విలువలున్నా ఊరికే అవే తినాలంటే కొందరికి చిరాకు అనిపిస్తుంది. అలాంటి వారికోసం ఈ పెరుగు పచ్చళ్లు సూపర్ ఆప్షన్. వెరైటీగా ఉండడమే కాకుండా వేడి ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. మరి.. వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

మామిడికాయ పెరుగు పచ్చడి :

కావాల్సిన పదార్థాలు :

  • పెరుగు - ఒకటిన్నర కప్పు
  • పచ్చి మామిడికాయ - ఒకటి
  • పచ్చిమిర్చి - కొన్ని
  • చిన్న ఉల్లిపాయలు - 4(సన్నగా తరుక్కోవాలి)
  • పసుపు - పావుచెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ఆవాలు - పావుచెంచా
  • మినపప్పు - చెంచా
  • ఇంగువ - అరచెంచా
  • కరివేపాకు - రెమ్మ
  • ఎండుమిర్చి - 2
  • నూనె - తగినంత

తయారీ విధానం :

  • ముందుగా స్టౌపై ప్యాన్ పెట్టుకొని నూనె వేసుకోవాలి. ఆపై అందులో ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి.
  • ఆ తర్వాత దానిలో మినపప్పు, ఇంగువా, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.
  • ఇప్పుడు మామిడి ముక్కలు, పసుపు వేసి ఆ మిశ్రమాన్ని మరో మూడు నిమిషాలు వేయించుకోవాలి.
  • ఆపై దానికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని మంట తగ్గించుకోవాలి.
  • ఇప్పుడు చిలికిన పెరుగు, కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీర కలుపుకోవాలి. అంతే.. నోరూరించే మామిడికాయ పెరుగు పచ్చడి రెడీ!

పెరుగు Vs మజ్జిగ - ఏది ఆరోగ్యానికి మంచిది?

సొరకాయ పెరుగు పచ్చడి :

కావాల్సిన పదార్థాలు :

  • సొరకాయ ముక్కలు - కప్పు
  • గిలకొట్టిన పెరుగు - రెండు కప్పులు
  • ఉల్లిపాయ - ఒకటి
  • పచ్చిమిర్చి - రెండు
  • కరివేపాకు రెబ్బలు - రెండు
  • ఎండుమిర్చి - రెండు
  • ఉప్పు - తగినంత
  • పసుపు - పావుచెంచా
  • అల్లంపేస్ట్ - చెంచా
  • జీలకర్ర - చెంచా
  • నూనె - తగినంత
  • ఆవాలు - చెంచా
  • కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం :

  • సొరకాయ ముక్కల్ని కుక్కర్​లో వేసి, ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు మరో పాత్రలో గిలకొట్టిన పెరుగును తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, పసుపు, చల్లారిన సొరకాయ ముక్కలు, అల్లం పేస్ట్, కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌమీద కడాయి పెట్టి తగినంత నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఆపై పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపు వేయించుకోవాలి.
  • రెండు నిమిషాలయ్యాక స్టౌ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారాక, అందులో మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పెరుగు వేసి బాగా కలిపితే సరిపోతుంది.
  • అంతే.. టేస్టీ సొరకాయ పెరుగు పచ్చడి రెడీ!

కీరాదోస పెరుగు పచ్చడి :

కావాల్సినవి : కీరదోస, ఉల్లిపాయ, పెరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం తరుగు, పుదీనా తరుగు, క్యారెట్ తరుగు, రుచికి సరిపడా ఉప్పు.

తయారీ విధానం :

  • ముందుగా కీరదోస, ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఒక పాత్రలో పెరుగును తీసుకొని గిల్లకొట్టుకోవాలి.
  • ఆపై పెరుగులో సన్నగా తురుమి పెట్టుకున్న కీరదోస, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అల్లం, క్యారెట్, పుదీనా తరుగుతో పాటు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
  • అదేవిధంగా జీలకర్ర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే.. కమ్మని కీరదోస పెరుగు పచ్చడి రెడీ!

చేప మాత్రమే కాదు.. ఇవి తిన్నాక కూడా పెరుగు అస్సలు తినొద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.