ETV Bharat / bharat

'బస్సు అంత పొడవున్న పాము'- ప్రపంచంలోనే అతిపెద్ద స్నేక్ అవశేషాలను కనుగొన్న సైంటిస్ట్​లు - SCIENTISTS DISCOVERY VASUKI

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 21, 2024, 10:42 AM IST

Scientists Discoverd Worlds Largest Snake Fossil : భూమిపై జీవించిన అతిపెద్ద పాము శిలాజాలను ఐఐటీ రూర్కీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గుజరాత్ లోని కచ్ లో ఈ పాము అవశేషాలను గుర్తించారు. ఈ పాము స్కూలు బస్సు అంత పొడవు ఉంటుందని అంచనా వేశారు.

Scientists Discoverd Worlds Largest Snake Fossil
Scientists Discoverd Worlds Largest Snake Fossil

Scientists Discoverd Worlds Largest Snake Fossil : గుజరాత్‌లోని కచ్‌లో ఇప్పటిదాకా భూమి మీద జీవించిన అతిపెద్ద పాము శిలాజాలను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు ఈ పాముకు సంబంధించిన 27 ఎముకలను కలిగి ఉన్న వెన్నెముకను గుర్తించారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూడ్​కీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి అతిపెద్ద పాము శిలాజాన్ని గుర్తించి పలు కీలక విషయాలు బయటపెట్టారు.

Scientists Discoverd Worlds Largest Snake Fossil
ప్రపంచంలోనే అతిపెద్ద పాము 'వాసుకి' అవశేషాలు గుర్తించిన ప్రాంతం

అనకొండ మాదిరిగానే
తాము గుర్తించిన పాము దాదాపు 11-15 మీటర్ల పొడవు ఉంటుందని ఐఐటీ రూడ్​కీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఈ పామును అంతరించిపోయిన టైటానోబోవాతో పోల్చారు. ఇప్పటివరకు భూమిపై జీవించిన అతి పొడవైన పాము ఇదేనని తెలిపారు. ఈ పాము పరిమాణం ఆధారంగా అనకొండ మాదిరిగానే ఇది నెమ్మదిగా కదిలే ప్రెడేటర్​గా అంచనా వేశారు.

Scientists Discoverd Worlds Largest Snake Fossil
ప్రపంచంలోనే అతిపెద్ద పాము 'వాసుకి' అవశేషాలు

'వాసుకి' ఇండికస్ అని నామకరణం
ఐఐటీ రూడ్​కీ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ పాముకి 'వాసుకి ఇండికస్' అని పేరు పెట్టారు. వాసుకి అనేది శివుడి మెడలో ఉండే పాము పేరు. ఈ పాము అంతరించిపోయిన మ్యాడ్సోడీ కుటుంబానికి చెందినదని, ఆఫ్రికా, యూరప్, భారత్​లో నివసించేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పాము జాతి 34 మిలియన్ ఏళ్ల క్రితం ఈయోసిన్ సమయంలో దక్షిణ ఐరోపా మీదుగా ఆఫ్రికాకు వచ్చిందని చెప్పారు.

Scientists Discoverd Worlds Largest Snake Fossil
ప్రపంచంలోనే అతిపెద్ద పాము 'వాసుకి' అవశేషాలు

'బస్సు అంత పొడవు'
ఈ అరుదైన పాము వెన్నెపూస ఆధారంగా దాని పొడవును అంచనా వేశారు శాస్త్రవేత్తలు. ఒక్క వెన్నెపూస 38 నుంచి 62 మిల్లీమీటర్ల మధ్య పొడవు, 62- 111 మిల్లీమీటర్ల వెడల్పు ఉండొచ్చని అంచనా వేశారు. 'ఈ పాము దాదాపు బస్సు అంత పొడవు ఉంటుంది. కచ్​లోని పనాండ్రో లిగ్నైట్ గనిలో పాము శిలాజాలను గుర్తించాం.' అని ఐఐటీ రూర్కీ జియాలజీ ప్రొఫెసర్ సునీల్ బాజ్‌పాయ్ తెలిపారు.

Scientists Discoverd Worlds Largest Snake Fossil
ప్రపంచంలోనే అతిపెద్ద పాము 'వాసుకి' అవశేషాలు

పాముకాటుకు విరుగుడు- ల్యాబ్​లో యాంటీబాడీల అభివృద్ధి
పాముకాటుకు విరుగుడు కనిపెట్టడంలో ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ శాస్త్రవేత్తలు విజయవంతమయ్యారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలో విడుదలయ్యే ప్రాణాంతకర విష పదార్థాలను నిర్వీర్యం చేయగల యాంటీబాడీని శాస్త్రవేత్తలు ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. ఈ కీలక పరిశోధనలో అమెరికాకు చెందిన స్కిప్స్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కూడా భాగస్వామ్యులయ్యారు. ఈ పరిశోధనకు హెచ్‌ఐవీ, కొవిడ్‌-19 వైరస్‌లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ప్రాతిపదికగా నిలిచింది.

Scientists Discoverd Worlds Largest Snake Fossil
ప్రపంచంలోనే అతిపెద్ద పాము 'వాసుకి' అవశేషాలు
Scientists Discoverd Worlds Largest Snake Fossil
ప్రపంచంలోనే అతిపెద్ద పాము 'వాసుకి' అవశేషాలు
Scientists Discoverd Worlds Largest Snake Fossil
ప్రపంచంలోనే అతిపెద్ద పాము 'వాసుకి' అవశేషాలతో సైటింస్టు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.