ETV Bharat / bharat

రైల్వేలో 5696 అసిస్టెంట్​ లోకో పైలట్ ఉద్యోగాలు - అప్లై చేయండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 20, 2024, 11:58 AM IST

RRB Assistant Loco Pilot Jobs In Telugu : ఐటీఐ, డిప్లొమాలు చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్ (RRB) 5696 అసిస్టెంట్ లోకో పైలట్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

railway jobs 2024
RRB Assistant Loco Pilot Jobs

RRB Assistant Loco Pilot Jobs : ఆర్ఆర్​బీ 5696 అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్​ఆర్​బీ రీజియన్స్
అహ్మదాబాద్​, అజ్మేర్​, బెంగళూరు, భోపాల్​, భువనేశ్వర్​, బిలాస్​పుర్​, చండీగఢ్​, చెన్నై, గువాహటి, జమ్ము​, కోల్​కతా, మాల్దా, ముంబయి, ముజఫర్​పుర్​, పట్నా, ప్రయాగ్​రాజ్​, రాంచీ, సికింద్రాబాద్​, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్​పుర్​

ట్రేడ్ విభాగాలు
ఫిట్టర్​, ఎలక్ట్రీషియన్​, ఇన్​స్ట్రుమెంట్ మెకానిక్​, మిల్​రైట్​/ మెయింటెనెన్స్​ మెకానిక్​, మెకానిక్​ (రేడియో/టీవీ), ఎలక్ట్రానిక్స్ మెకానిక్​, మెకానిక్ (మోటార్ వెహికల్​), వైర్​మ్యాన్​, ట్రాక్టర్ మెకానిక్​, ఆర్మేచర్ అండ్ కాయిల్ వైండర్​, మెకానిక్ (డీజిల్​), హీట్​ ఇంజిన్​, టర్నర్​, మెషినిస్ట్​, రిఫ్రిజిరేషన్​ అండ్ ఎయిర్​ కండిషనింగ్ మెకానిక్​

విద్యార్హతలు
RRB Assistant Loco Pilot Qualifications : అభ్యర్థులు పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పాస్​ అయ్యుండాలి. లేదా మెకానికల్​​, ఎలక్ట్రికల్​, ఎలక్ట్రానిక్స్​, ఆటోమొబైల్ ఇంజినీంగ్​ల్లో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి.

వయోపరిమితి
RRB Assistant Loco Pilot Age Limit :

  • అభ్యర్థుల వయస్సు 2024 జులై 1 నాటికి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనలు అనుసరించి, ఆయా కేటగిరీ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
RRB Assistant Loco Pilot Fee : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్​జెండర్​, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక ప్రక్రియ
RRB Assistant Loco Pilot Selection Process : అభ్యర్థులకు స్టేజ్​-1, స్టేజ్​-2 కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్​లు నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
RRB Assistant Loco Pilot Salary : అసిస్టెంట్ లోకో పైలట్​లకు నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం
RRB Assistant Loco Pilot Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఆర్​ఆర్​బీ అధికారిక వెబ్​సైట్​ https://indianrailways.gov.in/ ఓపెన్ చేయాలి.
  • ఆర్​ఆర్​బీ వెబ్​సైట్​లో మీ పేరు, ఫోన్ నంబర్​, ఈ-మెయిల్ తదితర వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • అప్పుడు మీ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ అవుతుంది.
  • మీరు మరలా పోర్టల్​లోకి లాగిన్ అవ్వాలి.
  • రిక్రూట్​మెంట్ సెక్షన్​లోకి వెళ్లి RRB ALP Recruitment 2024 లింక్​పై క్లిక్ చేసి ఓపెన్ చేయాలి.
  • అప్లికేషన్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన పత్రాలు అన్నీ అప్​లోడ్ చేయాలి.
  • అప్లికేషన్​ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్ ​చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్​ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
RRB Assistant Loco Pilot Apply Last Date :

  • ఆన్​లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 2024 జనవరి 20
  • ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 19

ఐటీఐ అర్హతతో 1646 రైల్వే ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ఐటీఐ, డిప్లొమా అర్హతతో AAIలో 130 పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.