ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లి వస్తున్న కారు, ట్రాక్టర్​ ఢీ- ముగ్గురు చిన్నారుల సహా 9మంది మృతి

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 18, 2024, 8:21 AM IST

Updated : Mar 18, 2024, 12:35 PM IST

Road accident in Bihar
Road accident in Bihar

Road accident in Bihar : బిహార్‌లోని ఖగారియాలో పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తున్న కారును ఓ ట్రాక్టర్‌ వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Road accident in Bihar : బిహార్​లో ఖగారియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్​, కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా తొమ్మిది మంది మరణించారు. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో పెళ్లింట తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ జరిగింది
ఖగారియాలో పెళ్లి ఊరేగింపు నుంచి తిరిగి వస్తున్న కారును ఓ ట్రాక్టర్‌ వేగంగా ఢీ కొట్టింది. పస్రాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానంద్ పెట్రోల్ పంప్ సమీపంలో సిమెంట్ లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న కాలువలోకి బోల్తా పడింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు కూడా మరణించడం మనసులను కలచివేసింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

Road accident in Bihar
రోడ్డు పక్కకు వెళ్లిన కారు

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్‌ అజాగ్రత్త, అతివేగం కారణంగా ప్రమాదం జరిగిందని గోగ్రీ డీఎస్పీ రమేష్ కుమార్ తెలిపారు. ప్రమాద సమయంలో కారు వేగంగా ఉందని భావిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం తర్వాత ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. స్థానికులు భారీగా ఘటనా స్థలానికి తరలివచ్చారు.

బిహార్​లోనే పెళ్లికి వెళ్లి వస్తుండగా
Bihar Road Accident News Today : అంతకుముందు కొన్ని రోజుల క్రితం బిహార్‌లోని లఖీసరాయ్‌ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆటో, లారీ పరస్పరం ఢీకొనడం వల్ల ఈ ఘటన జరిగింది. బాధితులు పెళ్లి వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వెల్లడించారు పోలీసులు.

Last Updated :Mar 18, 2024, 12:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.