ETV Bharat / bharat

చెన్నై ట్రావెల్​ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి- విజిటర్స్​ ఫిదా!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 15, 2024, 10:31 PM IST

Updated : Mar 15, 2024, 10:46 PM IST

Ramoji Film City Stall In Chennai : చెన్నైలో జరిగిన ట్రావెల్​ అండ్ టూరిజం 24వ ఫెయిర్​లో హైదరాబాద్​లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి చేసింది. సంస్థ అందిస్తున్న టూర్ ప్యాకేజీల గురించి వినేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. జీవితంలో ఒక్కసారైనా రామోజీ ఫిల్మ్​ సిటీని చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.

Ramoji Film City Stall In Chennai Travel & Tourism Fair
Ramoji Film City Stall In Chennai Travel & Tourism Fair

Ramoji Film City Stall In Chennai : తమిళనాడు చెన్నైలో ట్రావెల్​ అండ్​ టూరిజం నిర్వహించిన 24వ ఫెయిర్​లో హైదరాబాద్​లోని ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్​ సిటీ స్టాల్​ సందడి చేసింది. టూరిజం విభాగంలో రామోజీ ఫిల్మ్ సిటీ అందిస్తున్న వివిధ రకాల టూర్​ ప్యాకేజీల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకునేందుకు ఫెయిర్​కు వచ్చిన సందర్శకులు పోటీ పడ్డారు. జీవితంలో ఒక్కసారైనా రామోజీ ఫిల్మ్​ సిటీ లాంటి టూరిస్ట్​ స్పాట్​ను సందర్శించాలంటూ తమ ఆసక్తిని కనబరిచారు.

చెన్నైలోని నందంబాక్కంలో జరిగిన ఈ టూరిజం ఫెయిర్​లో బిహార్​, ఒడిశా, ఉత్తరాఖండ్​, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, దిల్లీ, గుజరాత్​, ఝార్ఖండ్​ సహా తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖలకు చెందిన ప్రతినిధులు ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాలకు చెందిన స్టాల్స్​ను ఏర్పాటు చేశారు. స్టాల్స్​లో నియమించిన సిబ్బంది తమ రాష్ట్రం అందిస్తున్న టూరిజం ప్యాకేజీల గురించి ఎగ్జిబిషన్​కు వచ్చిన సందర్శకులకు వివరించింది.

Ramoji Film City Stall In Chennai Travel & Tourism Fair
చెన్నై ట్రావెల్ ఫెయిర్​లో రామోజీ ఫిల్మ్ సిటీ స్టాల్

3 దేశాలు- 16 రాష్ట్రాలు
ఈ కార్యక్రమంలో ప్రైవేటు హోటళ్లు, టూరిజం ఆపరేటర్లు కూడా తమ స్టాల్స్​ గురించి పర్యటకులకు వివరించారు. నేపాల్​, థాయ్​లాండ్​ వంటి దేశాలు కూడా తమ టూరిజం ప్యాకేజీల గురించి విజిటర్స్​కు తెలియజేశాయి. భారత పర్యటక శాఖ కూడా ప్రత్యేకంగా ఓ స్టాల్​ను ఏర్పాటు చేసి తాము అందిస్తున్న సేవల గురించి విజిటర్స్​కు క్లుప్తంగా వివరించింది. మొత్తంగా 3 దేశాలతో పాటు దేశంలోని 16 రాష్ట్రాలకు చెందిన 160 టూరిజం స్టాల్స్​ ఇక్కడ ఏర్పాటయ్యాయి. కాగా, ఈ ప్రదర్శనను దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రీజనల్​ ట్రావెల్​ ట్రేడ్​ ఫెయిర్‌గా పేర్కొంటున్నారు నిర్వాహకులు.

'సినిమా ట్రైనింగ్ కూడా ఇస్తాం'
'సమ్మర్​ సీజన్‌లో రామోజీ ఫిల్మ్​ సిటీకి వచ్చే సందర్శకులను ఆకర్షించేందుకు త్వరలో సరికొత్త టూరిస్ట్ ప్యాకేజీలకు సంబంధించిన ప్రకటనలను విడుదల చేయబోతున్నాం. హైదరాబాద్​లోని రామోజీ ఫిల్మ్​ సిటీకి తమిళనాడు నుంచి నేరుగా వచ్చేందుకు రవాణా వ్యవస్థను కూడా సులభతరం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం' అని రామోజీ ఫిల్మ్​ సిటీ ట్రేడ్​ యూనిట్​ నుంచి ఫెయిర్​కు ప్రతినిధిగా వెళ్లిన హరి కృష్ణన్​ తెలిపారు.

"రామోజీ ఫిల్మ్​ సిటీ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఫిల్మ్​ సిటీ. దీనిని ప్రతిఒక్కరు తమ జీవితంలో ఒక్కసారైనా సందర్శించాలి. టూరిస్ట్​ స్పాట్​లలో ఇది ఒక మంచి పర్యటక ప్రదేశం' అని TTF నిర్వాహకులు ఫెయిర్‌ఫెస్ట్ మీడియా లిమిటెడ్‌కు చెందిన మహేశ్ ఈటీవీ భారత్​తో తెలిపారు.

ఎన్నికల కోడ్‌ కథ తెలుసా? ఎప్పుడు ప్రవేశపెట్టారు? అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?

శనిదేవుడికి బెల్లం నైవేద్యం- ఆంజనేయుడికి ఆకుపూజ- శనివారం ఇవి చేస్తే మీ సమస్యలన్నీ క్లియర్!

Last Updated : Mar 15, 2024, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.