ETV Bharat / bharat

9,999 వజ్రాలతో అయోధ్య రామమందిర నమూనా- పెన్సిల్ కొనపై రామయ్య చిత్రం

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 21, 2024, 12:19 PM IST

Ram Temple Portrait Made With Diamonds : అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కళాకారులు వివిధ రకాలుగా తమ కళలను ప్రదర్శిస్తున్నారు. సూరత్​కు చెందిన ఓ కళాకారుడు 9,999 వజ్రాలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించారు. మరో ఆర్టిస్ట్​ పెన్సిల్ కొనపై రామయ్య చిత్రాన్ని చెక్కారు.

Ram Temple Picture
Ram Temple Picture

Ram Temple Portrait Made With Diamonds : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపనకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మహోత్సవాన్ని పురస్కరించుకొని భక్తులు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా భక్తిని చాటుకుంటున్నారు. నిత్యం ఏదో ఒక అరుదైన, వినూత్నమైన కళారూపాలను తయారు చేస్తూనే ఉన్నారు. అలానే సూరత్​కు చెందిన ఓ కళాకారుడు వజ్రాలతో అయోధ్య రామమందిరం చిత్రాన్ని రూపొందించారు. 9,999 వజ్రాలతో ఆలయం, జై శ్రీరామ్, రాముడి చిత్రాల నమునాను తీర్చిదిద్దారు.

పెన్నిల్ కొనపై రాముడి చిత్రం
రాముడి చిత్రాన్ని పెన్సిల్ కొనపై చెక్కారు మహారాష్ట్రలోని జైపుర్​కు చెందిన గిన్నిస్ బుక్ ఆఫ్​ వరల్డ్ రికార్డ్స్​ హోల్డర్ నవరత్న ప్రజాపతి. దీన్ని పూర్తి చేయడానికి ఐదు రోజులు పట్టిందని తెలిపారు. 'ఇది 1.3 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతి చిన్న విగ్రహం. దీనిని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​కు బహుమతిగా ఇస్తాను. అలానే శ్రీరామ్​ మ్యూజియంలో పెట్టేలా ప్రయత్నిస్తాను' అని ప్రజాపతి వెల్లడించారు.

  • #WATCH | Jaipur: Guinness World Record holder sculptor Navaratna Prajapati carves out a statue of Shri Ram on the tip of a pencil.

    He says, "It took me 5 days to complete it. And it is just 1.3cm in height... This is the smallest statue in the world. I will gift this to the Shri… pic.twitter.com/c9nRo0duCM

    — ANI (@ANI) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఇది నాకు రెండో దీపావళి'
రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ వేడుకను రెండో దీపావళి పండుగులాగా అనిపిస్తుంది అని ఆఫ్రికన్- అమెరికన్ నటి, గాయని మేరీ మిల్​బెన్​ అన్నారు. "జనవరి 22న నేను కూడా దీపావళిని జరుపుకుంటున్నాను. నేను ఇండియాలో లేనందుకు బాధగా ఉంది. కానీ కచ్చితంగా ఈ వేడుకను ఇక్కడ జరుపుకుంటాను. ఇది ప్రజలందరూ కలిసి జరపుకునే అద్భుతమైన క్షణం" అని మేరీ మిల్​బెన్ చెప్పారు.

  • #WATCH | Arizona, US: On Ram temple 'Pran Pratishtha' ceremony, African-American actress and singer Mary Millben says, "The ceremony ('Pran Pratishtha') almost feels like second Diwali. I am going to celebrate Diwali (on January 22). I am sad that I won't be in India physically… pic.twitter.com/Imyt1x5RV3

    — ANI (@ANI) January 21, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భద్రతా వలయంలోకి అయోధ్య
అలానే అయోధ్య భద్రతా మొత్తం బలగాలే చూసుకొనున్నారు. అయోధ్య ఏటీస్ కమాండోలు, పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ పహారాలో ఉంది. ర్యాపిడ్‌ యాక్షన్ ఫోర్స్‌ను సైతం రంగంలో దించారు.పురుషులతో పాటు సాయుధ మహిళా కమాండోలను సైతం మోహరించారు. డ్రోన్ జామర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం నుంచే అయోధ్యలోకి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు. జవనరి 23 వరకూ ఇదే పరిస్థితి కొనసాగించనున్నారు.

రామాలయ సముదాయానికి 5 కిలోమీటర్ల పరిధిలో వారణాసి, మధుర మాదిరిగానే బారికేడ్లు పెట్టి, ఆంక్షలు విధించారు. ప్రాణప్రతిష్ఠకు వచ్చే అతిథుల వాహనాలు, స్థానికుల వాహనాలు, అనుమతి ఉన్నవాటిని మాత్రమే ఆదివారం, సోమవారం వరకూ అయోధ్య లో తిరిగేందుకు అనుమతి ఇచ్చారు. మిగిలిన వాహనాలను అయోధ్య వెలుపలే ఆపేస్తున్నారు.ఈమేరకు అయోధ్యకు దారితీసే ఐదు మార్గాల్లో ప్రత్యేక చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశారు. అతిథులు సైతం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఇచ్చిన లింకు ద్వారా తమ మొబైళ్ల నుంచి అయోధ్యలో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా ఏర్పాటు చేశారు. అతిథులకు ఇచ్చిన ప్రవేశ పాసులో ప్రత్యేక రీడర్‌ కోడ్‌తో సరిపోలితేనే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. QR కోడ్‌తో పాటు ఆధార్ కార్డు కూడా తప్పనిసరి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా దేశ, విదేశీ అతిథులు రానున్న నేపథ్యంలో హైఅలర్ట్‌ ప్రకటించారు.

144 సెక్షన్
శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠతో పాటు హజ్రత్ అలీ పుట్టిరోజు, రిపబ్లిక్ డే సందర్భంగా లఖ్​నవూలో 144 సెక్షన్​ అమలు చేస్తున్నారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఈ సెక్షను అమలు చేయనున్నారని జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఉపేంద్ర కుమార్ తెలిపారు. పేలుడు సంబంధించిన పదార్థాలు ఉంచకూడదని చెప్పారు.

శ్రీరాముడిపై బాలిక 'ఉడతా భక్తి'- అయోధ్య రామమందిరం నిర్మాణానికి రూ.52 లక్షలు సేకరణ

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ- ఆహ్వానం అందుకున్న దిగ్గజాలు వీరే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.