ETV Bharat / bharat

రైతులకు శుభవార్త - బ్యాంకు అకౌంట్లోకి పీఎం కిసాన్​ 17వ విడత నిధులు - ఎప్పుడంటే? - PM Kisan 17th Installment Date

author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 1:25 PM IST

Updated : May 17, 2024, 2:19 PM IST

PM Kisan 17th Installment: అన్నదాతలకు గుడ్​న్యూస్​. పీఎం కిసాన్​ 17వ విడత నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతున్నాయి. మరి.. డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడుతున్నాయనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

PM Kisan Installment
PM Kisan 17th Installment (ETV Bharat)

PM Kisan 17th Installment Release Date: రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం "ప్రధానమంత్రి కిసాన్​ సమ్మాన్​ నిధి" అనే పథకాన్ని తీసుకొచ్చింది. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ స్కీమ్​ ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి ఏటా 6 వేల రూపాయలు అందిస్తోంది. ఈ 6 వేల రూపాయలను సంవత్సరానికి మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్స్​లో జమ చేస్తూ వస్తోంది. ఏప్రిల్- జులై తొలి విడతగా, ఆగస్టు- నవంబర్ రెండో విడతగా, డిసెంబర్-మార్చి మూడో విడతగా.. 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకు పీఎం కిసాన్ పథకం ద్వారా 16 సార్లు నిధులు రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 28న మహారాష్ట్రలోని యావత్మాల్‌ జిల్లా నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిధుల్ని విడుదల చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పుడు 17వ విడత నిధులు విడుదల కావాల్సి ఉంది. ఇవి ఎప్పుడు అకౌంట్లలో జమ అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

రైతులకు శుభవార్త! ఈ స్కీమ్​లో చేరితే నెలకు 3వేల పింఛన్!

అందుతున్న సమాచారం ప్రకారం.. పీఎం కిసాన్​ 17వ విడత డబ్బులు మే నెల చివరి వారంలో లేదా జూన్ నెల మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సారి e- kyc పూర్తి చేసిన వారికి మాత్రమే పీఎం కిసాన్ డబ్బు అకౌంట్​లో జమ అవుతుందనే చర్చ కూడా సాగుతోంది. అలాగే బ్యాంక్ ఖాతా కూడా ఆధార్‌తో లింక్ అయ్యి ఉండాలట. ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు జమ కావని సమాచారం. కాబట్టి వెంటనే ఈ- కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

E KYC ఎలా చేయాలంటే? :

  • ముందుగా పీఎం కిసాన్​ అధికారిక వెబ్​సైట్​ https://pmkisan.gov.in/ లోకి లాగిన్​ అవ్వాలి.
  • ఆ తర్వాత హోమ్​ పేజీలో కుడివైపున e-KYC ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత ఆధార్​ నెంబర్​ ఎంటర్​ చేసి సెర్చ్​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • తర్వాత వివరాలు స్క్రీన్​ మీద డిస్​ప్లే అవుతాయి. ఓటీపీ సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.
  • పీఎం కిసాన్ యాప్‌లో ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
  • ఇంకా.. కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి కూడా బయోమెట్రిక్ సాయంతో కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

Kisan Rin Portal Details and Benefits in Telugu : అన్నదాతకు శుభవార్త.. అప్పుకోసం వడ్డీ వ్యాపారి వద్దకు అవసరం లేదు!

Last Updated :May 17, 2024, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.