ETV Bharat / bharat

లాలూపై ఈడీ ప్రశ్నల వర్షం- 9గంటలకుపైగా సుదీర్ఘ విచారణ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 10:48 PM IST

Updated : Jan 29, 2024, 10:58 PM IST

Lalu Prasad Yadav ED Case
Lalu Prasad Yadav ED Case

Lalu Prasad Yadav ED Case : 'ల్యాండ్​ ఫర్​ జాబ్​' కేసులో ఈడీ విచారణకు హాజరైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ను అధికారులు 9గంటలకుపైగా ప్రశ్నించారు.

Lalu Prasad Yadav ED Case : బిహార్​లో జరిగిన 'ల్యాండ్ ఫర్ జాబ్' మనీలాండరింగ్​ కుంభకోణంలో విచారణకు హాజరైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ను సుదీర్ఘంగా విచారించింది ఎన్‌ఫోర్స్‌మెంట్​ డైరెక్టరేట్(ఈడీ). సుమారు 9గంటలకుపైగా ప్రశ్నించినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్​ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు, లాలూ ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

విచారణ కోసం సోమవారం ఉదయం 11:00 గంటల ప్రాంతంలో పట్నాలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూ రాత్రి 8:50 గంటలకు బయటకు వచ్చారు. ఈ సమయంలో ఆయనతో కుమార్తె మిసా భారతి కూడా ఉన్నారు. ఈ క్రమంలో ఈడీ కార్యాలయానికి చేరుకున్న లాలూకు మద్దతుగా భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. అయితే ఆదివారం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన మరుసటిరోజే ఈ పరిణామం జరగడం వల్ల అక్కడి రాజకీయాలు మరోసారి హాట్​టాపిక్​గా నిలిచాయి.

ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి
'లాలూ ప్రసాద్​ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయణ్ను ఇన్ని గంటలపాటు విచారించకుండా ఉండాల్సింది. ఇది ఆయన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు' అని ఆర్జేడీ నేత లలిత్​ యాదవ్​ అన్నారు. మరోవైపు ఈడీ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం చేప్పినట్లుగా వ్యవహరిస్తోందని, ఈడీ అనేది ప్రస్తుతం ఒక జోక్​గా మారిందని ఆర్జేడీ మహిళానేత ఎజ్యా యాదవ్​ మండిపడ్డారు. అయితే ఈడీ సొంతంగా పనిచేస్తే లాలూపై ఇలాంటి ఆరోపణలు వచ్చేవి కాదని ఆమె వ్యాఖ్యానించారు.

  • VIDEO | “He (RJD supremo Lalu Yadav) is suffering from health issues; they (ED) should not have questioned him for so long. Questioning him for long hours would have negative effect on his health,” says RJD leader Lalit Yadav on ED questioning Lalu Yadav in connection with the… pic.twitter.com/taFwiu1acI

    — Press Trust of India (@PTI_News) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"లాలూ ప్రసాద్​ యాదవ్​కు ఇటీవలే ఆపరేషన్​ జరిగింది. అయినాసరే ఆరోగ్య సమస్యలున్న వ్యక్తిని ఇన్ని గంటలపాటు విచారించడం సరికాదు. ఇది ముమ్మాటికి ఆయణ్ను వేధించడమే."
- ఎజ్యా యాదవ్, ఆర్జేడీ నాయకురాలు

  • VIDEO | “The Union government has ED under its control. If ED is left independent, then there will be no accusations against Lalu Yadav. ED has become a joke. He has been recently operated on and they questioned him for nine hours. It was just to harass him,” reacts RJD leader… pic.twitter.com/l5JC0S9C0u

    — Press Trust of India (@PTI_News) January 29, 2024
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

'ఇది మాకు ఇన్విటేషన్​ కార్డు'
లాలూ ప్రసాద్ యాదవ్ విచారణ నిమిత్తం ఈడీ ఎదుట హాజరుకావడంపై ఆయన కుమార్తె, ఆర్జేడీ ఎంపీ మిసా భారతి మీడియాతో మాట్లాడారు. 'ఇది కొత్త విషయం కాదు. తమతో(బీజేపీని ఉద్దేశించి) రాని వారికి ఈ శుభాకాంక్షల కార్డు పంపుతోంది. ఏదైనా ఏజెన్సీ మా కుటుంబాన్ని పిలిచినప్పుడల్లా మేము అక్కడికి వెళ్లి వారికి సహకరిస్తాం. వారి ప్రశ్నలకు సమాధానం ఇస్తాం' అని తెలిపారు.

  • #WATCH | Bihar | RJD president Lalu Prasad Yadav arrives at the residence of former CM and his wife Rabri Devi, in Patna.

    His ED questioning in the Land for Job scam case, concluded after around 9 hours. pic.twitter.com/bwA1S8j9Bf

    — ANI (@ANI) January 29, 2024 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ కేసు
Land For Job Scam Bihar : లాలూ హయాంలో రైల్వే ఉద్యోగాలు ఇచ్చేందుకు ఉద్యోగార్థుల నుంచి వీరు కుటుంబం భూములు తీసుకుందని ప్రధాన ఆరోపణ. ఈ కారణంతో ఆరోపణలతో లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌కు మనీ లాండరింగ్‌ కేసులో ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది.

బిహార్​లో నయా సర్కార్​
Bihar Political Crisis : అనేక నాటకీయ పరిణామాల మధ్య బిహార్​లో ఆదివారం ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పడింది. బిహార్ ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నీతీశ్​తోపాటు బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాను డిప్యూటీ సీఎంలుగా బిహార్ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్​ ప్రమాణం చేయించారు. మరో ఎనిమిది ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్​భవన్​లో జరిగిన నీతీశ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు హాజరయ్యారు. లాలూ ప్రసాద్‌ యాదవ్‌ నేతృత్వంలోని ఆర్​జేడీతో బంధాన్ని తెంచుకుని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నీతీశ్ కుమార్.

ఈడీ విచారణకు లాలూ- ఎన్​డీఏ సర్కార్ ఏర్పాటైన మరుసటి రోజే

బిహార్ అసెంబ్లీ స్పీకర్​పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్

Last Updated :Jan 29, 2024, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.