ETV Bharat / bharat

పేద విద్యార్థికి ఐటీ షాక్- రూ.46కోట్లకు పన్ను కట్టాలని నోటీసులు- చివరకు! - Income Tax Notice To Poor Student

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 3:57 PM IST

Income Tax Notice To Poor Student : ఓ పేద విద్యార్థి బ్యాంకు ఖాతా నుంచి రూ.46కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని అధికారులు నోటీసులు పంపించారు. దీంతో కంగుతిన్న ఆ విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Income Tax Notice To Poor Student
Income Tax Notice To Poor Student

Income Tax Notice To Poor Student : కాలేజీ విద్యార్థి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఇన్​కమ్​ ట్యాక్స్​ అధికారులు అతడికి పన్ను నోటీసులు పంపారు. నోటీసులు చూసి కంగుతిన్న ఆ విద్యార్థి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్​ ఈ ఘటన జరిగింది.

గ్వాలియర్‌ జిల్లాలోని హస్తినాపుర్​ ప్రాంతానికి చెందిన ప్రమోద్‌ కుమార్‌ దండోటియా స్థానిక జీవాజీ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్​ చదువుతున్నాడు. జనవరి 27న అతడికి ఐటీ, జీఎస్‌టీ నుంచి పన్ను నోటీసులు వచ్చాయి. అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయని, అందువల్ల ఆ మొత్తానికి ఆదాయపు పన్ను చెల్లించాలనేది వాటి సారాంశం. దీంతో ఆ విద్యార్థి సంబంధిత అధికారులను సంప్రదించగా తన పాన్‌ కార్డుపై ఓ కంపెనీ రిజిస్టర్‌ అయినట్లు తెలిసింది.

ఆ కంపెనీ 2021 నుంచి ముంబయి, దిల్లీ వేదికగా కార్యకలాపాలు సాగించిందని తెలుసుకున్నాడు ప్రమోద్​. ఈ విషయమై ప్రమోద్​ కుమార్ ఆదాయపు పన్ను విభాగం, డీఎస్​డీ డిపార్ట్​మెంట్​ కలెక్టర్, పోలీసులను సంప్రదించాడు. అయినా ఫలితం లేకపోయింది. పోలీసుల వద్దకు వెళ్లి ఎఫ్​ఐఆర్​ నమోదు చేయించుకుని, తమకు సమర్పించాలని ఆదయపు పన్ను అధికారులు చెప్పారు. దీంతో ప్రమోద్​ కుమార్​ శుక్రవారం క్రైమ్​ బ్రాంచ్​ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్​ పోలీస్​ వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పాడు. ఆ లావాదేవీలకు తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ కంపెనీ గురించి తనకు తెలియదని పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

''ఆ విద్యార్థి పాన్‌ కార్డును గుర్తుతెలియని వ్యక్తులు దుర్వినియోగం చేసి కంపెనీని రిజిస్టర్‌ చేశారు. ఆ తర్వాతే అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి రూ.కోట్లలో లావాదేవీలు జరిగాయి. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది'' అని పోలీసులు వెల్లడించారు.

బామ్మ, మనవరాలికి బస్సు ఫ్రీ- నాలుగు చిలుకలకు .444 టికెట్
కర్ణాటక బెంగుళారులోని కేఎస్​ఆర్​టీసీలో బస్సులో ఓ మహిళ తన వెంట తెచ్చుకున్న నాలుగు చిలుకల కోసం కండక్టర్​కు రూ.444 చెల్లించి టికెట్ తీసుకుంది. మనవరాలితో బస్సు ఎక్కిన ఆ మహిళ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన శక్తి స్కీమ్​ కింద ఉచితంగా ప్రయాణం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చిలుకల కోసం ఆ మహిళ తీసుకున్న టికెట్​ వైరల్​గా మారింది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ లింక్​పై క్లిక్ చేయండి

"ర్యాట్​ గ్లూ"పై అలుపెరగని యుద్ధం - అమెజాన్ To ఫ్లిప్‌కార్ట్ అన్నీ తొలగించాయి! - ఎందుకో తెలుసా? - BAN ON RAT GLUE PADS

సీపీఐకి ఐటీ నోటీసులు- రూ.11కోట్లు ట్యాక్స్ కట్టాలట! - IT Notice to CPI

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.