ETV Bharat / bharat

దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్- 'జైలు నుంచే పరిపాలన' - Kejriwal Arrested

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 7:14 PM IST

Updated : Mar 21, 2024, 10:06 PM IST

ed at kejriwal home
ed at kejriwal home

KEJRIWAL ARRESTED : ఆప్‌ అధినేత, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. శుక్రవారం కోర్టు ముందు హాజరుపరచనుంది.

  • దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఉద్రిక్తత
  • కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఆప్‌ నేతల ఆందోళన
  • కేజ్రీవాల్‌ నివాసం వద్ద ఆప్‌ నేతలు, కార్యకర్తల నిరసన
  • ఆందోళనకు దిగిన ఆప్‌ నేతలు, కార్యకర్తల అరెస్టు
  • ఆప్‌ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను అరెస్టు చేసిన పోలీసులు
  • దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును ఖండించిన ఆప్‌ నేతలు
  • కేజ్రీవాల్‌ దిల్లీ ముఖ్యమంత్రిగానే కొనసాగుతారు: అతిషి
  • దిల్లీ సర్కారును కేజ్రీవాల్ జైలు నుంచే నడిపిస్తారు: అతిషి
  • కేజ్రీవాల్‌ అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాం: అతిషి
  • ఈ రాత్రికే అత్యవసరంగా విచారించాలని కోరుతాం: అతిషి
  • సుప్రీంకోర్టును ఆశ్రయించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది
  • దిల్లీ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు
  • అరెస్టు నుంచి కేజ్రీవాల్‌కు మినహాయింపు ఇవ్వలేమన్న దిల్లీ హైకోర్టు
  • పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు
  • పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని తెలిపిన సుప్రీంకోర్టు
  • గురువారం రాత్రే విచారించాలని కోరిన కేజ్రీవాల్ న్యాయవాదులు
  • 09.38 PM
    దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్​ను స్పెషల్ PMLA కోర్టు ముందు ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. విచారణ కోసం కస్టడీ కోరనున్నారు.
  • 09.15 PM

Kejriwal Arrested : దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లిన ఈడీ అధికారులు, ఆయన్ను అరెస్టు చేశారు. అంతకముందు ఆయన ఫోన్‌ను సీజ్‌ చేశారు. అయితే ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారని మంత్రి ఆతిషి తెలిపారు. సుప్రీం కోర్టులో కేసు వేశామని, అత్యవసరంగా విచారించాలని సర్వోన్నత న్యాయస్థానాన్నిడిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు.

ED At Kejriwal Home : దిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఇటీవల భారాస నేత కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు, తాజాగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసానికి వెళ్లారు. దాదాపు 12 మంది అధికారులతో కూడిన ఈడీ బృందం ఆయనకు పదోసారి సమన్లు ఇచ్చేందుకు వెళ్లినట్లు సమాచారం. సీఎం నివాసం వద్ద సిబ్బంది ఆరా తీయగా, సెర్చ్‌ వారెంట్‌తోనే వచ్చామని చెప్పినట్లు తెలుస్తోంది.

"పోలీసులు లోపలికి వెళ్లడం, ఎవరినీ లోపలికి అనుమతించకపోవడాన్ని బట్టి చూస్తుంటే సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని వారు ప్లాన్ చేసినట్లు అర్థమవుతోంది" అని దిల్లీ మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ తెలిపారు. ఒకవేళ కేజ్రీవాల్​ను అరెస్ట్ చేస్తే దిల్లీ ప్రజలంతా ఇక్కడికి చేరుకుంటారని, ఆయనకు అండగా ఉంటారని మరో మంత్రి ఆతిషి తెలిపారు.

ప్రస్తుతం కేజ్రీవాల్‌ను విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు, భద్రతా బలాగాలు మోహరించడం వల్ల హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. సీఎం నివాసానికి ఆప్‌ నేతలు, పెద్ద సంఖ్యలో ఆప్‌ కార్యకర్తలు తరలివస్తున్నారు. పలువురు కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్‌ గొంతు అణచివేసేందుకే!
కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల రాకపై దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయెల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఇప్పటివరకు 600మందదికి పైగా అరెస్టు చేశారని తెలిపారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ గొంతు అణిచివేసేందుకే ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని గోయెల్‌ విమర్శించారు. ఒకవేళ అరెస్ట్ అయినా కేజ్రీవాల్ రాజీనామా చేయరని చెప్పారు.

గంటల వ్యవధిలోనే!
మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు నిరాకరించారు. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు దిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు కల్పించేందుకు ఇప్పటికిప్పుడు ఆదేశాలిచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకోవడం వంటి పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.

సుప్రీంకు కేజ్రీ
ఇదిలా ఉండగా ఈ అంశంపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి విచారణ జరిపించేందుకు లీగల్‌ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్‌ ఎంపీ సంజయ్‌ సింగ్‌ అరెస్టయి జైల్లో ఉన్నారు.

Last Updated :Mar 21, 2024, 10:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.