ETV Bharat / bharat

ఝార్ఖండ్ మంత్రి అరెస్ట్- పనిమనిషి దగ్గర దొరికిన డబ్బులే కారణం! - Jharkhand Minister Alamgir Alam

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 6:44 PM IST

Updated : May 15, 2024, 9:38 PM IST

Jharkhand Minister Arrested : మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్​ మంత్రి ఆలంగీర్ ఆలమ్​ను ఈడీ అరెస్ట్ చేసింది. ఆలంగీర్ ఆలమ్​ పీఏ సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి ఇంట్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

Jharkhand Minister
Jharkhand Minister (ETV Bharat)

Jharkhand Minister Arrested : మనీలాండరింగ్ కేసులో ఝార్ఖండ్​ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు ఆలంగీర్ ఆలమ్(70)​ను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్- ఈడీ బుధవారం అరెస్ట్ చేసింది. ఆలంగీర్ ఆలమ్​ పీఏ సంజీవ్ లాల్ ఇంటి పనిమనిషి ఇంట్లో భారీ నగదు స్వాధీనం చేసుకున్న కేసులో అరెస్ట్ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) నిబంధనల ప్రకారం, ఈడీ జోనల్ కార్యాలయంలో రెండో రోజు ప్రశ్నోత్తరాల సమయంలో సుమారు ఆరు గంటల పాటు విచారించిన తర్వాత అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.

పనిమనిషి జహంగీర్ ఆలమ్ ఇంట్లో!
గత వారం ఆలంగీర్ ఆలమ్​ పీఏ సంజీవ్ కుమార్ లాల్ (52) పనిమనిషి జహంగీర్ ఆలమ్ ఇంట్లో 32 కోట్ల రూపాయలకు పైగా నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖలో అక్రమాలు జరుగుతున్నాయని, ఆ సొమ్ము అందుకు సంబంధించిందేనని ఆరోపించారు. గత వారం ఇదే వ్యవహారంలో జహంగీర్‌తో పాటు మంత్రి సంజీవ్‌లాల్‌ను ఈడీ అరెస్టు చేసింది. మరోవైపు, రాంచీలోని ఈడీ ఆఫీస్ వెలుపల భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

'నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను'
ఆలంగీర్ ఆలమ్ అరెస్ట్​పై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్పందించారు. "ఒక అలంగీర్ ఆలమ్‌ను అరెస్టు చేశారు ఇతరులను కూడా అరెస్టు చేయాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు. "డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఆధారాలు ఉన్నాయి. అందుకే అరెస్ట్ చేశారు. చట్టం ముందు అన్నీ ఒకటే. ప్రజల సొమ్మును దోచుకున్న వారు అరెస్ట్ అవ్వక తప్పదు" అని రాజ్యసభ ఎంపీ, బీజేపీ నేత దీపక్‌ ప్రకాశ్‌ తెలిపారు.

కొన్నిరోజుల క్రితం, జనవరి 31న ఝార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్​ను ఈడీ అరెస్టు చేసింది. సోరెన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక రికార్డులను తారుమారు చేయడం, కల్పిత లావాదేవీలు, నకిలీ పత్రాలతో కోట్లాది రూపాయల విలువైన భూమిని సంపాదించడం ద్వారా అక్రమ ఆదాయాన్ని సంపాదించారని ఈడీ ఆరోపించింది. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొనేందుకు వీలు కల్పించాలని మధ్యంతర బెయిల్ కోసం సోరెన్ ఇటీవల న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. అందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

Last Updated :May 15, 2024, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.