ETV Bharat / bharat

రాజకీయాలకు సీఎం గుడ్​బై- వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటన - CM Siddaramaiah Retirement

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 5:49 PM IST

Updated : Apr 2, 2024, 8:05 PM IST

CM Siddaramaiah Retirement
CM Siddaramaiah Retirement

CM Siddaramaiah Retirement : రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయనని తేల్చి చెప్పారు. ప్రస్తుత సీఎం పదవికాలం ముగిశాక రిటైర్మెంట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

CM Siddaramaiah Retirement : కర్ణాటక సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య తన రాజకీయ భవితవ్యంపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుత సీఎం పదవీకాలం ముగిశాక రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఇక పోటీ చేయనని తేల్చి చెప్పారు. 'వచ్చే నాలుగేళ్లలో నాకు 83 ఏళ్లు పూర్తవుతాయి. ఆ సంగతి నాకు తెలుసు. ఆ తర్వాత అంత నిబద్దతతో పనిచేయలేను. నా శరీర పరిస్థితి ఏంటో నాకు మాత్రమే తెలుసు. అందుకే ఇకపై ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయించుకున్నాను' అని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు.

'నాకు మాత్రమే తెలుసు'
'ప్రజలు నన్ను ప్రేమతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయమని అడిగారు. వాళ్ల కోరిక మేరకు నేను పోటీ చేశాను. ఇకపై మాత్రం పోటీ చేయను. నా ఆరోగ్యం గురించి నాకు మాత్రమే తెలుసు. అందుకే ఇక ఎన్నికల రాజకీయాలు చాలు అని నిర్ణయించుకున్నాను. నా కుమారుడు డాక్టర్ యతీంద్రకు ఎన్నికల సంఘం నుంచి నోటీసులు అందాయి. దానికి వివరణ కూడా ఇచ్చాం. ఆ నోటీసులో ఏముందో నా కుమారుడుకి తెలుసు. దానిపై నేను వ్యాఖ్యానించను. బెంగుళూరులో నీటీ సమస్య లేదు. అప్పుడప్పుడు కొన్ని ఊహజనిత నివేదికలు రాస్తుంటారు. ఓ రెండు చోట్ల నీటీ సమస్యలు వచ్చాయి. వాటిని పరిష్కరించాం.' అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు.

అమిత్​షా పై వివాదాస్పద వ్యాఖ్యలు
గతనెల 28న కర్ణాటకలోని హనూరులో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో యతీంద్ర మాట్లాడుతూ అమిత్​ షాపై వివాదాస్పద వ్యాఖ్యలు అని విమర్శించారు. ''గుజరాత్​లో మారణహోమానికి పాల్పడిన అమిత్ షా లాంటి వ్యక్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టారు'' అని యతీంద్ర కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన బీజేపీ శ్రేణులు చామరాజనగర్ జిల్లా ఎన్నికల అధికారి సీటీ శిల్పానాగ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కాంగ్రెస్ నేత యతీంద్రకు జిల్లా ఎన్నికల అధికారి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

దిల్లీ సీఎంగా సునీతా కేజ్రీవాల్​? ఆప్​ వ్యూహమేంటి? - Delhi Next CM Sunitha Kejriwal

దిల్లీ మద్యం కేసులో బిగ్ ట్విస్ట్- ఆప్ కీలక నేత సంజయ్​ సింగ్​కు బెయిల్​ - Sanjay Singh liquor policy case

Last Updated :Apr 2, 2024, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.