ETV Bharat / bharat

డిసెంబరు కల్లా రామమందిర నిర్మాణం పూర్తి- జెట్ స్పీడ్​లో పనులు- వేలాది మంది కార్మికులతో! - Ayodhya Ram Mandir

author img

By ETV Bharat Telugu Team

Published : Apr 20, 2024, 4:50 PM IST

Etv BharatAyodhya Ram Mandir
Ayodhya Ram Mandir

Ayodhya Ram Mandir Construction Status : 2024 డిసెంబరులో అయోధ్య రామమందిర నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఇందుకోసం కార్మికుల సంఖ్యను భారీగా పెంచనున్నారు. ఈ మేరకు అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ నుంచి ఎల్ అండ్ టీ, టాటా, యూపీ ప్రభుత్వ నిర్మాణ సంస్థలకు ఆదేశాలు జారీ అయ్యాయి. వివరాలివీ.

Ayodhya Ram Mandir Construction Status : ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్య రామమందిరం నిర్మాణ పనులు ఈ ఏడాది చివరికల్లా పూర్తి కానున్నాయి. డిసెంబరులోగా రామమందిరం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కీలకమైన ఆలయ శిఖరంతో పాటు మొదటి, రెండో, మూడో అంతస్తుల పనులను వచ్చే ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గర్భగుడిలో రామ్ దర్బార్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన పనులను ఇప్పటికే రామజన్మభూమి కాంప్లెక్స్‌లో ప్రారంభించారు. ఈ పనుల్లో వేగాన్ని పెంచేందుకు గాను ఎల్ అండ్ టీ, టాటా, ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వ నిర్మాణ సంస్థ తమ ఉద్యోగుల సంఖ్యను పెంచనున్నాయి. డిసెంబరు నాటికి ఆలయ పనులను పూర్తి చేస్తామని అయోధ్య రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు.

వేలాది మంది కార్మికులతో!
రామ మందిర నిర్మాణ సమయంలో కింద అంతస్తులో ఏర్పాటు చేసిన స్తంభాల్లో విగ్రహాలను చెక్కేందుకు 200 మంది కళాకారులను నియమించారు. మొదటి అంతస్తు పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. మిగతా మూడు అంతస్తుల్లో పనులు చేసేందుకు దాదాపు 1200 మంది కార్మికులను నియమించారు. ఇక ఆలయ భద్రత కోసం 800 మీటర్ల పొడవైన గోడను కూడా నిర్మిస్తున్నారు. ఇందులో ప్రదక్షిణ మార్గం, మరో ఆరు దేవతలకు ఆలయాలను సైతం నిర్మిస్తున్నారు. ఈ పనులను ఇంతకుముందు వరకు 2000 మంది కూలీలు చేసేవారు. త్వరలోనే వీరి సంఖ్యను 5 వేలకు పెంచనున్నారు. ఇందుకోసం ఎల్‌అండ్‌టీ, ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వ నిర్మాణ సంస్థలకు ఆలయ నిర్మాణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

మొత్తం 8 ఆలయాలు
రామజన్మభూమి కాంప్లెక్స్‌లో వివిధ దేవతలకు చెందిన మొత్తం ఎనిమిది ఆలయాలను నిర్మించనున్నారు. శేషావతార్, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్త్య, మహర్షి వశిష్ఠ, నిషాద్ రాజ్, అహల్యా దేవి ఆలయాలను నిర్మించాలని ప్రతిపాదించారు. వీటన్నింటి నిర్మాణం పూర్తి కావడానికి మరో 18 నెలల సమయం పడుతుంది. ఈనెల 17న అయోధ్య రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. అంతకంటే ఒకరోజు ముందే (ఏప్రిల్ 16న) ఆలయ నిర్మాణ పనులను వేగవంతం చేసే అంశంపై రామమందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా సమీక్షించారు. ఆ సమావేశంలో రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక ఆధారంగానే 2024 డిసెంబర్‌లోగా ఆలయ పనులను పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు సాగనున్నారు.

Ayodhya Ram Mandir
Ayodhya Ram Mandir

'5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం'- బాల రాముడికి దివ్యాభిషేకం- HD ఫొటోలు చూశారా? - Sri Rama Navami Ayodhya

చెక్కపై శ్రీరామ దర్బార్​- కళ్లకు కట్టినట్లుగా పట్టాభిషేకం- చేతులతోనే రెండేళ్లు శ్రమించి తయారీ - Sri Rama Darbar Sculpture On Wood

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.