తెలంగాణ

telangana

WATERFALLS: సొగసు చూడతరమా.. ఒంటిలొద్ది జలపాతం పాలపొంగు అందాలు

By

Published : Jul 28, 2021, 12:02 PM IST

()
అది దట్టమైన అటవీ ప్రాంతం. పచ్చదనం పులుముకున్న ఎత్తైన కొండలు. ఎటు చూసినా చెట్ల పొదల్లోనుంచి తొంగి చూసే జంతువులు. ఆ రమణీయ ప్రదేశంలో భారీ వృక్షాలు, కొండల మధ్య ఓ జలదృశ్యం. 250 ఫీట్ల ఎత్తు నుంచి దూకుతున్న ఈ జలపాతం.. వరంగల్‌ నుంచి 150 కి.మీటర్ల దూరంలో ఉంది. ఈ జలపాతాన్ని ప్రాణాలకు తెగించి ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ బృందం వెలుగులోకి తీసుకొచ్చింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మంగవాయి గూడెం నుంచి 7కిలోమీటర్ల దూరంలోని దట్టమైన అటవీప్రాంతంలో ఉంది. కొండ పైనుంచి జాలువారే జలపాతాలు. గిరులను, తరులను పలకరిస్తూ సాగిపోయే సెలయేర్లు మనసును ఆహ్లాద పరుస్తాయి. పాలపొంగులా ఉబికి వచ్చే నీటి ధారలు ప్రకృతి ప్రేమికుల్ని కట్టిపడేస్తాయి. అదే ఒంటిలొద్ది జలపాతం.

ABOUT THE AUTHOR

...view details