తెలంగాణ

telangana

PRATHIDWANI: సీబీఐ పనితీరు ఎందుకింత తీసికట్టుగా మారింది?

By

Published : Sep 6, 2021, 10:12 PM IST

దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ.. సీబీఐ. సవాళ్లకు ఎదురీదుతూ.. చిక్కుముళ్లను విప్పుతూ.. నేర పరిశోధనను కొలిక్కి తీసుకుని రావటంలో అందరినోటా మొదటిగా వినిపించే మాట సీబీఐనే. కానీ కొద్ది రోజులుగా ఆ ప్రభ మసకబారుతోంది. సీబీఐ కేసు తీసుకుందంటే.. నేరగాళ్లకు ముచ్చెమటలే అన్న రోజులు పోయి.. కోర్టుల్లో, బయట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది... కేంద్ర దర్యాప్తు సంస్థ. హైకోర్టుల నుంచి సుప్రీం కోర్టు వరకు అక్షింతలు, మొట్టికాయలు, ఆగ్రహాలు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. పాలకుల చేతిలో పావుగా మారొద్దని.. మరోసారి అదే ధర్మాగ్రహం వ్యక్తం చేసింది.. దేశ సర్వోన్నత న్యాయస్థానం. సీబీఐ పనితీరు నేడు ఎందుకు ఇంత తీసికట్టుగా మారింది? ఎందుకింత అపప్రదను ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details