తెలంగాణ

telangana

Prathidhwani: అబలలపై అఘాయిత్యాలకు అంతమెప్పుడు?

By

Published : Sep 20, 2021, 10:36 PM IST

()
పెరుగుతున్న నేరాలకు ప్రధాన కారణం ఏమిటి? మహిళలపై అఘాయిత్యాలకు అంతం ఎక్కడ? దాడులు, అత్యాచారాల వంటి తీవ్ర నేరాలకు అసలు మూలాలను గుర్తిస్తున్నామా? ఈ విషయంలో కొద్దిరోజులుగా అన్ని వేళ్లు.. మద్యం, మత్తు పదార్థాలు, అశ్లీల చిత్రాల వైపే చూపిస్తున్నాయి. సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్న మానవ మృగాళ్లను పెంచి పోషిస్తోన్నది ఎవరో.. ఏమిటో.. కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఒకచోట మద్యం మత్తులో, మరొక చోట మాదకద్రవ్యాల మైకంలో.. ఇంకొక చోట బూతు ఊబిలో మునిగి.. కన్నుమిన్ను కానక..! అత్యాచారాలే కాదు, హత్యలు, దాడులు, బెదిరింపులు, అపహరణల వంటి దారుణాల లింకులూ చాలా వరకు.. ఇక్కడే తేలుతున్నాయి. దీనికి ఎవరు బాధ్యులు? మార్పు ఎలా? ఇదే అంశంపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని చర్చా కార్యక్రమం.

ABOUT THE AUTHOR

...view details