తెలంగాణ

telangana

రెండేళ్ల బాలుడి పైనుంచి కారు ఎక్కించిన డ్రైవర్‌.. లక్కీగా..

By

Published : Sep 2, 2022, 10:22 AM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

()
barampet car accident viral video: రెండేళ్ల బాలుడి పైనుంచి కారు వెళ్లిన ఘటన హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లో జరిగింది. బరంపేట్ ల్యాండ్‌మార్క్‌-2 గృహ సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇంటి ముందు పార్కు చేసి ఉన్న కారును తీస్తున్న సమయంలో బాలుడు అక్కడికి చేరుకున్నాడు. అది గమనించని డ్రైవర్‌ బాలుడి పైనుంచి కారును ఎక్కించాడు. అలాగే ముందుకు పోనిచ్చాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం తప్పినట్లు వైద్యులు తెలిపారు. ఇందుకు సంబంధించి సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated :Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details