తెలంగాణ

telangana

షుగర్ వ్యాధి వచ్చే ముందు ఎలాంటి లక్షణాలుంటాయి?

By

Published : Oct 27, 2022, 7:14 AM IST

symptoms of pre diabetes
symptoms of pre diabetes

మధుమేహం.. చాలా రకాల మొండి వ్యాధుల్లో ఇదొకటి. ఒక్కసారి వస్తే దాంతో దాదాపు జీవితకాలం సహజీవనం చేయాల్సిందే. అలాంటి వ్యాధి వచ్చే ముందు లక్షణాలు ఎలా ఉంటాయి? వచ్చిన తర్వాత హెచ్చుతగ్గులు ఉంటే ఎలాంటి లక్షణాలుంటాయి? ఘగర్ వ్యాధి నిర్ధరణ కోసం ఎలాంటి టెస్టులు చేసుకోవాలో తెలుసుకుందాం.

మధుమేహం.. సందేహాలు

షుగర్‌ వ్యాధి.. భారత దేశాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన వ్యాధుల్లో ఒకటి. ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్​.. చైనా తర్వాత రెండో స్థానంలో ఉంది. ఆనారోగ్యకరమైన జీవన విధానాల వల్ల షుగర్​ పేషెంట్లు ఎక్కువైపోతున్నారు. అయితే ఈ వ్యాధి వచ్చేముందు లక్షణాలు ఎలా ఉంటాయి, షుగర్ లెవెల్స్​ తక్కువ స్థాయిలో ఉంటే ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనే విషయాలు తెలుసుకుందాం.

షుగర్ వ్యాధి వచ్చే ముందు ఎలాంటి లక్షణాలుంటాయి?
షుగర్ వ్యాధి వచ్చే ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్ దిలీప్ నందమూరి తెలియజేశారు. ఏ వయసు వారికైనా తరచూ ఆకలి, దప్పిక ఎక్కువ అవడం, మూత్రం రావడం వంటివి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి అని సూచించారు. అయితే థైరాయిడ్​ సమస్యలు ఉన్నా అలాంటి లక్షణాలు ఉంటాయట. అందుకే డాక్టర్లను సంప్రదించి వ్యాధి నిర్ధరణ చేసుకోవాలని చెప్పారు.

ఘగర్ తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలుంటాయి?
షుగర్ తక్కవగా ఉన్న వాళ్లకు చెమటలు పడ్డటం, చేతులు వణకడం, గాబరా/దడగా అనిపించడం, బరువు తక్కువగా ఉండటం లాంటి లక్షణాలు ఉంటాయి అంటున్నారు డాక్టర్ శివ రాజు. "అయితే వీటిన జాగ్రత్తగా గమనించాలి. హైపర్ థైరాయిడ్, స్ట్రెస్, యాంగ్జైటీ వంటి కారణాలతో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తం తగ్గినా దడ, నీరసంగా ఉంటారు. వీటిని నిర్ధరించుకోవడం కోసం సీబీపీ, థైరాయిడ్ టెస్ట్​ చేసుకోవాలి. అయినా అలానే ఉంటే షుగర్ వ్యాధి నిర్ధరణ చేసుకోవాలి" అని సూచిస్తున్నారు డాక్టర్ శివ రాజు.

షుగర్ స్థాయిలో హెచ్చు తగ్గులకు కారణాలు?
సాధారణంగా ఫాస్టింగ్ బ్లడ్​ షుగర్ రేంజ్​ 120 పైన, పోస్ట్​ బ్లడ్​ షుగర్ 140 పైన ఉంటే మధుమేహం ఉన్నట్టు నిర్ధరిస్తారని అంటున్నారు డాక్టర్ శివరాజు. దీంతో పాటు హెచ్​బీఏ1సీ టెస్ట్​ రేంజ్​ 6.5 శాతం కన్నా ఎక్కువ ఉంటే షుగర్ వ్యాధిగా నిర్ధరిస్తారు. అయితే షుగర్ స్థాయిలో హెచ్చు తగ్గులు వస్తే.. మహిళల్లో రుతుక్రమం సరిగా ఉండదని చెబుతున్నారు డాక్టర్​ శివ రాజు.

ఎలా టెస్ట్​ చేసుకోవాలి?
లక్షణాలు కనిపిస్తే డాక్టర్లను సంప్రదించి షుగర్​ వ్యాధి పరీక్షలు చేసుకోవాలి. ఈ పరీక్షలు మూడు రకాలు ఉంటాయి. మొదటిది ఫాస్టింగ్ బ్లడ్ ఘగర్. అంటే దాదాపు 8-12 గంటలు ఉపవాసం ఉండి.. టెస్టు చేసుకోవాలి. రెండోది పోస్ట్​ప్రాండియల్ బ్లడ్​ ఘగర్. దీన్ని బ్రేక్​ ఫాస్ట్​ అయిన 2-3 గంటల తర్వాత చేసుకోవాలి. ఇక మూడోది హెచ్​బీఏ1సీ లెవెల్. ఈ పరీక్ష మూడునెలల పరీక్షల సగటును తీస్తారు. ఆ సగటును బట్టి బ్లడ్​లో హీమోగ్లోబిన్​ ఎంత శాతం ఉందో లెక్కకడతారు. హీమోగ్లోబిన్ శాతం 6.5 శాతం కన్నా ఎక్కువ ఉన్నట్టైతే షుగర్ ఉందని నిర్ధరిస్తారు.

ఇవీ చదవండి :30+ ఏజ్​లోనే ముఖంపై ముడతలా? ఈ సింపుల్​ ఎక్సర్​సైజ్​లతో మాయం!

‘దీపావళి కాలుష్యం’ నుంచి ఊపిరితిత్తులు జాగ్రత్త.. ఇవిగో చిట్కాలు

ABOUT THE AUTHOR

...view details