తెలంగాణ

telangana

సీజనల్​ వ్యాధులకు చెక్​ పెట్టండిలా..

By

Published : Jan 13, 2022, 7:01 AM IST

seasonal diseases in winter
సీజనల్ వ్యాధులు ()

Seasonal Diseases in Winter: వాతావరణంలో మార్పు వచ్చిందంటే సహజంగానే కొన్ని వ్యాధులు ప్రబలుతాయి. ప్రస్తుతం శీతాకాలంలో జలుబు, వైరల్ జ్వరాలు వంటి సాధారణ జబ్బులతో పాటు ఆస్తమా, ఫ్లూ వంటివి కూడా సోకుతాయి. మరి ఈ సీజనల్ వ్యాధులకు ఎలా అడ్డుకట్ట వేయాలో తెలుసుకోండి.

Seasonal Diseases in Winter: వాతావరణం చల్లగా మారింది. చలి తీవ్రత పెరిగే కొద్దీ.. నిద్రానంగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ తలెత్తుతాయి. వాతావరణ మార్పుల కారణంగా జలుబు, దగ్గు, ఫ్లూ సహా చర్మ వ్యాధులు, ఆస్తమా, కీళ్ల నొప్పులు, చిన్నారుల్లో విరేచనాలు, వైరల్ జ్వరాలు పలకరిస్తూ ఆందోళనకు గురిచేస్తాయి. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శీతాకాలంలో వచ్చే వ్యాధులు..

శీతాకాలంలో ముఖ్యంగా జలుబు, దగ్గు, ఫ్లూ, చర్మ వ్యాధులు, ఆస్తమా, కీళ్ల నొప్పులు, చిన్నారుల్లో విరేచనాలు, వైరల్ జ్వరాలు, మలేరియా, ఫైలేరియా, కండరాల నొప్పులు వంటివి వస్తుంటాయి. వీటితో పాటు సోరియాసిస్, ఎగ్జిమా, ఫంగల్ ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు ఎదురవుతాయి. వాటికి బ్యాక్టీరియా, వైరస్​లు ప్రధాన కారణం.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జలుబు ఉన్నవారు తుమ్మినా, చీదినా, దగ్గినా.. ముక్కును, నోరును కవర్​ చేసుకోనప్పుడు.. ఇంకొకరు ఆ గాలిని పీలిస్తే వారికి కూడా ఆ వైరల్​ ఇన్​ఫెక్షన్​ వచ్చే అవకాశముంది. కాబట్టి అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక బట్టలు, వస్తువులు లాంటివి షేర్ చేసుకోవడం, షేక్​ హ్యాండ్​ ఇవ్వడం లాంటి వల్ల కూడా ఒకరి నుంచి మరొకరికి ఇన్ఫెక్షన్​ వ్యాపిస్తుంది. జలుబు చేసినప్పుడు ఇతరులకు కొంచెం దూరంగా ఉండటం మంచింది.

కీళ్ల నొప్పులు..

సరైన వ్యాయామం లేకపోతే కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తుంటాయి. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే నొప్పులు ఎక్కువ అవుతాయి. కాబట్టి అలాంటి వారు ఉదయం వ్యాయామం చేయడం అవసరం.

చిన్నపిల్లల్లో విరేచనాలు తగ్గాలంటే.. పుట్టిన ఏడు, ఎనిమిది నెలల్లో వ్యాక్సిన్​ తప్పనిసరిగా వేయించాలి.

వైరల్​ జ్వరాలు..

డెంగీ, మలేరియా బారినపడకుండా ఉండాలంటే.. ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి. నీరు నిల్వ ఉండేవాటిని రోజూ మారుస్తూ ఉండాలి. దోమతెరలను వాడాలి. లార్వాలను నాశనం చేసే రసాయనాలను పిచికారీ చేస్తుండాలి. ఒడోమస్ లేపనం పూసుకోవడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

చర్మానికి తగినంత సూర్యరశ్మి అందితే ఎముకలకు మేలు జరగుతుంది. ఎముకలకు, చర్మ సమస్యలకు ఉపయోగపడేలా.. ఐరన్, క్యాల్షియం, పీచు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు వంటి పోషకాలున్న ఆహారాన్ని తినాలి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే.. శీతాకాలంలోనూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

ఇదీ చూడండి:గుండె పోటు ముప్పును ముందే పసిగట్టండిలా..

ABOUT THE AUTHOR

...view details