తెలంగాణ

telangana

శీఘ్రస్కలన సమస్య ఉంటే పిల్లలు పుట్టరా?

By

Published : Sep 19, 2021, 7:00 AM IST

Pre-Ejaculate

శీఘ్రస్కలన సమస్య (Pre-Ejaculate) చాలామందిని వేధిస్తుంటుంది. రతిలో ఎక్కువసేపు పాల్గొనలేకపోవడం అనేది దీనిలో ప్రధాన సమస్య. మనలో కలిగే ఒకవిధమైన ఉద్యేగం కారణంగా ఇది ఏర్పడుతుందని వైద్యులు చెప్తున్నారు. అయితే కొత్తగా పెళ్లి అయిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సమస్యతో వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా అనేది నవదంపతులకు మదిలే మెదిలే ప్రశ్న. దీనికి సమాధానం ఈ స్టోరీలో..

కొత్తగా పెళ్లైన జంటకు శృంగారం గురించి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కొంతమందిలో కొన్ని రకాలైన సమస్యలు రతిలో గొప్ప అనుభవాన్ని అందించలేకపోతాయి. ముఖ్యంగా మగవారిలో శీఘ్రస్కలనం (Pre-Ejaculate) ఇలాంటి సమస్యల్లో ఒకటి. దీని ద్వారా దంపతులిద్దరూ కూడా శారీరక సుఖాలను పొందలేకపోతుంటారు. శృంగారంలో కలిగే తియ్యటి అనుభూతిని ఆస్వాదించలేకపోతారు. దీంతో ఇరువురి మధ్యలో దూరం పెరుగుతుంది. అయితే మగవారిలో ఈ శీఘ్రస్కలనం అనేది ఎందుకు జరుగుతుంది? దీనిని అధిగమించడం ఎలా? ఈ సమస్య ఉన్న వ్యక్తులకు పిల్లలు పుట్టరా?

శీఘ్రస్కలనం అంటే శృంగారంలో పాల్గొన్న పురుషుడు త్వరగా అంతిమ దశకు చేరుకోవడం. ఈ ప్రక్రియ భాగస్వామిని నిరుత్సాహానికి గురిచేస్తుంది. ఇది మగవారు రతిలో పాల్గొన్నప్పుడు తొందరపాటుకు గురైతే ఇలా జరుగుతుంది. శృంగారంలో పాల్గొన్నప్పుడు భయం, ఆందోళన, కంగారు, గాబర వంటివి ఉంటే ఇది చోటుచేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.

శీఘ్రస్కలనాన్ని నిరోధించడం ఎలా?

రతి క్రీడలో ఇరువురు మనసులు ప్రశాంతంగా ఉంటే దీనికి అవకాశం ఉండదు. అందుకే శృంగారంలో పాల్గొనేటప్పుడు మనలోని భావాలను అధీనంలో ఉంచుకోవాలి. లేకపోతే కొన్ని టిప్స్​ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అవే స్టార్ట్​ అండ్​ స్టాప్, స్క్వీజ్​ టెక్నిక్​లు. అయితే రెండు నెలలు ప్రయత్నించడం ద్వారా ఈ శీఘ్రస్కలనాన్ని నిరోధించవచ్చని వైద్యులు చెప్తున్నారు.

శీఘ్రస్కలనం ఉన్న వ్యక్తి భార్య సుఖపడగలదా?

ఈ విషయంలో కొంతమంది భార్యలు అసంతృప్తితో ఉంటారు. కానీ ఈ సమస్యతో సుఖపడకుండా ఉండడం అనేది ఉండదు. ఇందుకోసం భర్త మాటలతో, ముద్దులతో ముందుగా ఫోర్​ ప్లే చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా భాగస్వామి మానసికంగా కొంత కామోత్సాహం పొంది.. సుఖాన్ని అనుభవిస్తుంది.

శీఘ్రస్కలన సమస్య ఉంటే పిల్లలు పుట్టే అవకాశం ఉండదా?

శీఘ్రస్కలన సమస్య ఉంటే పిల్లలు పుట్టరు అనేది అపోహ మాత్రమే. దీనికి పిల్లలు పుట్టడానికి ఎటువంటి సంబంధం లేదు. పిల్లలు పుట్టడానికి కావాల్సింది కేవలం వీర్యం, అండం. ఇవి ఉంటే పిండోత్పత్తి జరుగుతుంది. అయితే రతిలో స్త్రీ, పురుషులు సంతృప్తి చెందారా? లేదా అనేది కూడా ఇక్కడ అనవసరమైన విషయమని నిపుణులు చెప్తున్నారు.

ఇదీ చూడండి:నైట్​ డ్యూటీ చేసే వాళ్లు.. పగలు వయాగ్రా వేసుకోవచ్చా?

ABOUT THE AUTHOR

...view details