తెలంగాణ

telangana

అట్టహాసంగా ముగిసిన జాతీయస్థాయి అథ్లెటిక్​ పోటీలు

By

Published : Sep 20, 2021, 12:41 AM IST

అట్టహాసంగా ముగిసిన జాతీయస్థాయి అథ్లెటిక్​ పోటీలు
అట్టహాసంగా ముగిసిన జాతీయస్థాయి అథ్లెటిక్​ పోటీలు ()

హనుమకొండ జిల్లా కేంద్రంలోని జేఎన్​ఎస్​ మైదానంలో జరిగిన 60వ జాతీయ స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్​షిప్​ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. 5 రోజుల పాటు సాగిన పోటీల్లో క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

హనుమకొండ జిల్లా కేంద్రంలోని జేఎన్​ఎస్​ మైదానంలో 5 రోజుల పాటు జరిగిన 60వ జాతీయ స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్​షిప్​ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాఠోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్​భాస్కర్, వరంగల్‌ సీపీ తరుణ్‌ జోషి హాజరయ్యారు. పోటీల్లో రాణించిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా వరంగల్ క్రీడలకు పెట్టింది పేరని మంత్రులు కొనియాడారు. వరంగల్​ను స్పోర్ట్స్ హబ్​గా తీర్చిదిద్దటానికి అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు 50 ఎకరాల భూమిని సేకరిస్తామని మంత్రి దయాకర్​రావు తెలిపారు. జాతీయ క్రీడలు మరిన్ని నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

బహుమతుల ప్రదానం

రాష్ట్రంలో క్రీడలకు సీఎం కేసీఆర్ పెద్దఎత్తున ప్రోత్సాహం ఇస్తున్నారని మరో మంత్రి సత్యవతి రాఠోడ్‌ పేర్కొన్నారు. జాతీయ స్థాయి క్రీడలు ఇక్కడ నిర్వహించడం కోసం అన్ని రకాల వసతులు కల్పించారని తెలిపారు.

అయితే ముగింపు వేడుకలకు వర్షం ఆటంకం కలిగించింది. వాన వల్ల ప్రేక్షకులు ఎవరూ హాజరుకాలేకపోయారు. క్రీడకారులు తడిసి ముద్దయ్యారు. వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

5 రోజుల పాటు జరిగిన జాతీయ స్థాయి ఓపెన్ అథ్లెటిక్ పోటీల్లో అథ్లెట్లు అత్యుత్తమ క్రీడా ప్రదర్శనతో తమ సత్తా చాటారు. 10 వేల మీటర్ల పరుగు పందెంలో పురుషుల విభాగంలో కార్తీక్ కూమార్ బంగారు పతకం సాధించారు. మహిళల విభాగంలో 10 వేల మీటర్లలో సంజీవని బంగారు పతకం సాధించింది. ట్రిపుల్‌ జంప్‌లో ప్రవీణ్‌ చిత్రవేల్‌ బంగారు పతకాన్ని సాధించారు.

ఇదీ చూడండి: balapur Ganapati Immersion: ప్రశాంతంగా ముగిసిన బాలాపూర్​ గణపతి నిమజ్జనం

ABOUT THE AUTHOR

...view details