తెలంగాణ

telangana

Expired Saline: ఎనిమిది రోజుల బాలునికి ఎక్స్​పైర్డ్​ సెలైన్​.. ఏం కాదంటున్న వైద్యుడు..!

By

Published : Aug 29, 2021, 7:58 PM IST

Expired Saline to 8 days baby in thanusha children hospital narsampet
Expired Saline to 8 days baby in thanusha children hospital narsampet ()

చిన్నారుల ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పాల్సిన సిబ్బందే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కేవలం ఎనిమిది రోజుల వయసున్న బాలునికి నాలుగు నెలల కిందట ఎక్స్​పైరీ అయిన సెలైన్​ ఎక్కించి.. ఆ తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించారు. ఇదేంటని నిలదీస్తే.. నిర్లక్ష్యపు సమాధానాలతో మరింత కోపం వచ్చేలా చేస్తున్నారు.

ఎనిమిది రోజుల వయసున్న పిల్లాడికి కాలం చెల్లిన సెలైన్​ ఎక్కించిన ఘటన వరంగల్​ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన సురుగురి రాజు, మాధురి దంపతులకు ఎనిమిది రోజుల క్రితం బాబు జన్మించాడు. పిల్లాడికి కొంత అనారోగ్యంగా ఉండటం వల్ల పట్టణంలోని తనూష పిల్లల ఆసుపత్రికి తరలించారు.

తనూష పిల్లల ఆస్పత్రి

చిన్నారిని పరీక్షించిన వైద్యుడు జాన్​సన్... బాబుకు పసిరికలు అయ్యాయని తెలిపాడు. ఫొటో థెరఫీ బాక్స్​లో పెట్టి చికిత్స అందించాలని వైద్యుడు సూచించాడు. ఆయన సూచన మేరకే చికిత్స అందించాలని తల్లిందండ్రులు తెలపగా... బాబును ఫొటో తెరఫి బాక్సులో ఉంచారు. సెలైన్ కూడా ఎక్కించారు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు బాబు దగ్గరికి వెళ్లి చూడగా.. ఆ సెలైన్ బాటిల్​ మీద​ ఎక్స్​పైరీ తేదీ 2021-ఏప్రిల్​ వరకే ఉండటాన్ని గమనించారు. వెంటనే సిబ్బందికి తెలియజేయగా.. తీసేశారు. అప్పటికే చిన్నారికి సగానికి పైగా సెలైన్​ ఎక్కటం వల్ల కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.

గడువు తీరిన సెలైన్​ బాటిల్​

ఇదేంటని నిలదీస్తే.. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఇదే విషయమై వైద్యుడు జాన్​సన్​ను అడిగితే.. గడువు తీరిన సెలైన్​ ఎక్కించినా చిన్నారికి ఎలాంటి ఇబ్బంది రాదని సమాధానం ఇవ్వటం ఆశ్చర్యానికి గురిచేస్తోందన్నారు. బాబుకు ఏం కాదని... నెల రోజుల వరకు చిన్నారి బాధ్యత తనదే అని వైద్యుడు భరోసా ఇవ్వగా.. కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.

ఫొటో థెరపీలో చిన్నారి

ఇదీ చూడండి:

weather report: తెలంగాణలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం

ABOUT THE AUTHOR

...view details