తెలంగాణ

telangana

Flood water: భారీ వర్షాలకు నీట మునిగిన కాలనీ.. జలదిగ్బంధంలో స్థానికులు

By

Published : Sep 29, 2021, 4:29 PM IST

nandan rathan pride colony

ఏకధాటి వర్షాలు లోతట్టు ప్రాంతాల ప్రజలను కలవరపెడుతున్నాయి. చిన్నపాటి వానకే వీధులన్నీ జలమయమవుతుంటే.. ఇక భారీ వాన పడితే కాలనీలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. దీనికి తోడు అక్రమ నిర్మాణాలు కూడా ప్రకృతి వైపరీత్యాలకు కారణమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా నందన్ రతన్ ప్రైడ్ కాలనీలో.. వరదనీరు పోయే మార్గం లేక జలమయమైంది.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు డివిజన్ పరిధిలోని నందన్ రతన్ ప్రైడ్ కాలనీ నీటమునిగింది. ఇటీవలే నూతనంగా వెలిసిన ఈ కాలనీలో దాదాపు 300 ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.

వర్షపు నీరు పోయే గొలుసుకట్టు కాలువలను మూసేసి నిబంధనలకు విరుద్ధంగా ఈ కాలనీలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీంతో 2రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ జలమయమైంది. రాకపోకలకు కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. స్థానిక కార్పొరేటర్ కుమార్ యాదవే, ఉప కమిషనర్ బాలయ్య కాలనీని పరిశీలించారు. వరద నీరు పోయేందుకు చర్యలు చేపట్టారు.

నందన్ రతన్ ప్రైడ్ కాలనీని పరిశీలిస్తున్న కార్పొరేటర్

ఇదీ చదవండి:Revanth reddy on huzurabad bypoll: రెండురోజుల్లో హుజూరాబాద్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రకటన

ABOUT THE AUTHOR

...view details