తెలంగాణ

telangana

Ellampalli Project: ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేత.. 16,600 క్యూసెక్కుల విడుదల

By

Published : Jul 14, 2021, 7:06 PM IST

Ellampalli Project
ఎల్లంపల్లి ()

పైనుంచి వరద రావటంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి పాజెక్టు నిండు కుండలా మారింది. ఆరు గేట్లు ఎత్తి 16,600 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.

గోదావరి ఎగువన భారీ వర్షాలు కురవటంతో కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. దీంతో పెద్దపల్లి జిల్లా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాశయంలో నీటిమట్టం భారీగా పెరిగింది. జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి 24,400 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వస్తోంది. ఈ క్రమంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆరు గేట్లు ఎత్తి 16,600వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 19.45 టీఎంసీలుగా ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రాజెక్టు ఆనకట్ట, దిగువ గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎవరు నదీ తీరం వద్దకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ప్రతి గంటకోసారి సైరన్ మోగిస్తూ మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు.

మధ్య మానేరుకు నీటి తరలింపు

ఎల్లంపల్లి దిగువన ఉన్న పార్వతి పంప్ హౌస్ నుంచి గత నెల 18వ తేదీ నుంచి ఈనెల 9వ తేదీ వరకు 30 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి జలాశయంలోకి రివర్స్ పంపింగ్ ద్వారా ఎత్తి పోశారు. గత నెల 16వ తేదీ నుంచి ఈనెల 7వ తేదీ వరకు ఎల్లంపల్లి జలాశయంలో నుంచి నంది గాయత్రి పంపుల ద్వారా మధ్య మానేరుకు 24 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. మధ్య మానేరు నుంచి కొద్ది రోజుల పాటు దిగువ మానేరుకు నీరు విడుదల చేశారు.

అన్నారం బ్యారేజీకి కొనసాగుతోన్న వరద

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. అన్నారం బ్యారేజీ 5 గేట్లు ఎత్తి 4,500 నీటిని విడుదల చేస్తున్నారు. అన్నారం బ్యారేజీ ఇన్‌ఫ్లో 7,700 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 10.87 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 8.54 టీఎంసీలు ఉంది.

ఇదీ చదవండి:cm kcr: ధాన్యాగారంగా తెలంగాణ.. వ్యవసాయంపై మంత్రివర్గ ఉపసంఘం

ABOUT THE AUTHOR

...view details