తెలంగాణ

telangana

రానున్నరోజుల్లో మంథనిని మరో కోణసీమగా మారుస్తాం: మంత్రి కొప్పుల

By

Published : Mar 8, 2021, 10:34 PM IST

Minister Koppula laid the foundation stone for several development works in Peddapalli district
రానున్నరోజుల్లో మంథనిని మరో కోణసీమగా మారుస్తాం: మంత్రి కొప్పుల

సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో దేశంలోనే తెలంగాణ ప్రత్యేకతను సంతరించుకుందని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే మానేరు వాగులోని నీరంతా వృథాగా గోదావరి నదిలో కలిసేదని మంత్రి విమర్శించారు.

రానున్న రోజుల్లో మంథని మరో కోనసీమగా మారుతుందని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. జిల్లా పరిషత్​ ఛైర్మన్​ పుట్ట మధుకర్​తో కలిసి మంథని, ముత్తారం మండలాల్లోని ఖమ్మం పల్లి, అడవి శ్రీరాంపూర్, ఓడెడ్ గ్రామాల్లో మానేరు వాగుపై రూ.100 కోట్ల నిర్మిస్తున్న 5 చెక్ డ్యామ్​ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఖమ్మంపల్లి, ముత్తారం, మైదంబండ గ్రామాల్లో మూడు రైతు వేదిక భవనాలను ప్రారంభించారు.

ఇదీ చదవండి:మహిళలు రాణించడానికి కాంగ్రెస్​ విధానాలే కారణం: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details