తెలంగాణ

telangana

Coal production effect: భారీవర్షాలతో నిలిచిపోయిన ఉపరితల బొగ్గు ఉత్పత్తి

By

Published : Sep 7, 2021, 2:14 PM IST

cola
cola ()

రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి సంస్థ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపిలేని వర్షాలతో రామగుండం రీజియన్​, మంచిర్యాల జిల్లాలోను ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో గత రెండు రోజుల నుంచి సింగరేణి సంస్థ ఉపరితల (ocp) గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. రామగుండం రీజియన్​లో నాలుగు ఓసీపీలు... మేడిపల్లి ఓసీపీలో దాదాపు బొగ్గు ఉత్పత్తి నిల్వలు తగ్గి పోయాయి. మిగిలిన ఓసీపీ 1, 2, 3 లలో రోజుకు సుమారు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి కొనసాగుతుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. ఉపరితల గనుల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. ఉపరితల గనుల్లో భారీగా బురద చేరడంతో భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పూర్తిస్థాయిలో వర్షం తగ్గితేనే ఉపరితల ఉత్పత్తి కొనసాగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

బురదగా మారిన గనులు

మంచిర్యాలలో...

గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. జిల్లాలోని మందమర్రి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ఏరియాలోని ఉపరితల గనుల్లో 16 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. వరద నీరు గనుల్లోకి చేరి యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మట్టి వెలికితీత పనులు కూడా నిలిచిపోయాయి. వర్ష ప్రభావంతో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఉపరితల గనుల్లో పనులు నిలిచిపోవడం వల్ల రోజుకు సుమారుగా రూ.3 కోట్ల 20 లక్షలు నష్టం కలుగుతోంది.

పెద్దపలిలోని ఉపరితల గనుల్లో చేరిన వర్షపు నీరు

ఇదీ చూడండి:Car tied with rope: కారును కట్టేశాడు... కొట్టేస్తారని కాదు.. కొట్టుకుపోతుందని..

ABOUT THE AUTHOR

...view details