తెలంగాణ

telangana

GODAVARI RIVER IS POLLUTED: ఆ నురుగ లోగుట్టు.. గోదావరికే ఎరుక

By

Published : Aug 6, 2022, 8:10 PM IST

గోదావరి

GODAVARI RIVER IS POLLUTED: జీవ నది గోదావరి కాలుష్యంతో నిండిపోతోంది. పెద్దపల్లి జిల్లాలో గోదావరి పరివాహకంలో ఉన్న కంపెనీల వ్యర్థాలను నదిలోకి వదులుతుండటంతో నీరు కలుషితంగా మారుతోంది. దీంతో భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించేెందుకు ఇబ్బందులు పడుతున్నారు.

GODAVARI RIVER IS POLLUTED: పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణం తీరంలోని గోదావరి నది కలుషితమై నీటిపై నురగ తేలియాడుతుంది. శ్రావణమాసం సందర్భంగా పవిత్రమైన రోజులు కావడంతో వ్రతాలు చేసుకునే భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి తరలివస్తుంటారు. ఎన్నడూ లేని విధంగా రెండు రోజులుగా గోదావరిలో నురగ పేరుకుపోయి అంతా వ్యాపించడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైనుంచి వస్తున్న వ్యర్థజలాలతో నీరు కలుషితమవుతుందని వారు వాపోతున్నారు.

గతంలో ఎన్నడూ ఈ విధంగా చూడలేదని భక్తులు తెలిపారు. నదిపై భాగంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం కావడం.. అక్కడ ఉన్నటువంటి కర్మాగారాల నుంచి కలుషితమైన నీరు గోదావరిలోకి రావడంతోనే కలుషితమవుతుందని చెప్పారు. నది తీరాన ఉన్న రైతులు కూడా ఈ కలుషిత నీటితో పంటలు సాగు చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే సరైన చర్యలు తీసుకోవాలని.. గోదావరి కలుషితం కాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ఆ నురుగ లోగుట్టు.. గోదావరికే ఎరుక

ఇవీ చదవండి:Rajagopal reddy on Revanth : 'కార్యకర్తలు కష్టపడి.. రేవంత్‌ను సీఎం చేయాలా..?'

సైకిల్​పై వెళ్తూ డ్రైనేజీలో పడ్డ బాలిక.. 2 గంటల రెస్క్యూ ఆపరేషన్​.. చివరకు...

ABOUT THE AUTHOR

...view details