తెలంగాణ

telangana

నిలువురాళ్లు ప్రాంతానికి యునెస్కో గుర్తింపు కోసం కృషి చేయాలి: టీటా

By

Published : Aug 16, 2021, 4:43 PM IST

tita

నారాయణపేట జిల్లాలోని నిలువురాళ్లు చారిత్రక ప్రాంతానికి యునెస్కో గుర్తింపు దక్కేలా కృషి చేయాలని రాష్ట్ర పర్యాటకశాఖకు.. ఐటీ అసోసియేషన్ టీటా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్​ను కలిసి వినతిపత్రం అందించారు.

నారాయణపేట జిల్లాలోని కృష్ణమండలం, ముడుమూల్ గ్రామంలో ఉన్న నిలువురాళ్లు ప్రాంతాన్ని టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాలా తన బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిలువురాళ్లకు 5 వేల ఏళ్ల నాటి చరిత్ర ఉందని, ఆదిమానవుడి కాలంలో వీటిని ప్రతిష్టించారని చెప్పుకుంటారని పేర్కొన్నారు. చారిత్రక నేపథ్యమున్న ఈ ప్రాంతం ప్రాశస్త్యాన్ని కోల్పోతోందని... దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు దక్కేలా కృషి చేయాలని కోరారు. ఈమేరకు మంత్రికి వినతి పత్రం అందజేశారు.

నిలువురాళ్లు ప్రాంతాన్ని తన బృందంతో కలిసి పరిశీస్తున్న టీటా అధ్యక్షుడు సందీప్ మక్తాలా

టీటా విజ్ఞప్తిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. పురావస్తు శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని.. తాను కూడాత్వరలోనే నిలువురాళ్లు ప్రాంతాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చారు. కనుమరుగవుతోన్న చారిత్రక సంపద ప్రాచుర్యానికి కృషి చేస్తోన్న టీటా కృషిని ఈసందర్భంగా మంత్రి అభినందించారు.

ఇదీ చూడండి:Ramappa Temple : రామప్ప ఆలయానికి క్యూ కట్టిన ప్రముఖులు, పర్యాటకులు

ABOUT THE AUTHOR

...view details