తెలంగాణ

telangana

ప్రయోగం చేసెదేలా..? సైన్సు విద్యార్థుల అవస్థలకు తప్పని పాట్లు..

By

Published : Jan 8, 2023, 9:09 AM IST

inter practicals
ఇంటర్​ ప్రయోగం ()

‍‍Inter Practicals Classes Nill In Narayana peta: ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. నారాయణపేట జిల్లాలో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. సైన్స్‌ విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రాక్టికల్స్‌ చేసేందుకు రసాయనాలు, లవణాలు, పరికరాలు అందుబాటులో లేవు. ఈ పరిస్థితుల్లో పరీక్షలలో రాణించేది ఎలా అని విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు.

నారాయణ పేట జిల్లా జూనియర్​ కళాశాల పరిస్థితి

‍‍Inter Practicals Classes Nill In Narayana peta: సైన్స్‌ విద్యార్థులకు ప్రయోగాలు తప్పనిసరి. బోధించిన విషయాలను ప్రయోగ పూర్వకంగా వివరిస్తేనే వాటిపై అవగాహన కలుగుతుంది. భౌతిక, జీవ, రసాయన శాస్త్రాల్లో.. ప్రయోగాలపై ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి.. వాటికి మార్కులు కేటాయిస్తారు. ఇంతటి ప్రాధాన్యమున్న ప్రయోగ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. నారాయణపేట జిల్లాలోని కొన్నికళాశాలల్లో.. ప్రాక్టికల్స్‌ చేసేందుకు.. అవసరమైన రసాయనాలు, పరికరాలు అందుబాటులో లేవు. ఇలాంటి పరిస్థితుల్లో.. పరీక్షలకు సన్నద్ధమయ్యేది ఎలా అని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు.

నారాయణపేట జిల్లాలోని దామరగిద్ద, మద్దూరు, కోస్గి, మక్తల్, మాగనుర్, ధన్వాడ, ఊట్కుర్‌ జూనియర్ కళాశాలల్లో.. ప్రయోగాలు చేసేందుకు పరికరాలు ఉన్నప్పటికీ.. రసాయనాలు, లవణాలు, సూచికలు లేక నామమాత్రంగా ప్రయోగ తరగతులు నిర్వహిస్తున్నారు. నారాయణపేట, కృష్ణ, మరికల్ కేజీబీవీలలో ప్రయోగ పరికరాలు పూర్తి స్థాయిలో సరఫరా కాలేదు. ల్యాబ్‌లో సైతం సరైన వసతులు లేవని అధ్యాపకులు అంటున్నారు.

రెండేళ్లుగా ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో.. అప్పటి రసాయనాలతోనే ప్రయోగాలు చేయాల్సివస్తుందని అధ్యాపకులు అంటున్నారు. చేసిన ప్రయోగాలు సైతం.. సరైన ఫలితాలు ఇవ్వకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. పరీక్షలకు ఇంకా నెలరోజుల సమయమే ఉండటంతో.. విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు కావాల్సిన పరికరాలను అందజేయాలని కోరుతున్నారు.

"ఈ కళాశాల ప్రారంభోత్సవంలో ప్రయోగశాలను ఏర్పాటు చేసి అందుకు కావల్సిన ప్రాక్టికల్​ సామగ్రిని ప్రభుత్వం సమకూర్చింది. కానీ రెండు, మూడు సంవత్సరాల నుంచి లవణాలు, రసాయనాలు, సూచికలు వంటివి అందుబాటులో లేవు. ప్రతి సంవత్సరం ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులు ప్రయోగాలను చేస్తేనే వారికి అవగాహన అనేది ఏర్పడుతుంది." - ప్రతాప్​రెడ్డి, ప్రిన్సిపాల్​

"మా కళాశాలలో ప్రయోగాలు నిర్వహించడానికి రసాయనాలు లేకపోవడం వల్ల ప్రయోగాలను చేయలేకపోతున్నాము. రాబోయే ప్రాక్టికల్​ పరీక్షల్లో సరైన మార్కులు సాధించాలంటే వీటి అన్నింటిని వెంటనే సమకూర్చాలని కోరుకుంటున్నాము." - విద్యార్థులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details