తెలంగాణ

telangana

అక్కడ విద్యుత్త్ స్తంభమే వంతెన... బ్రిడ్జి కట్టాలని విద్యార్థుల అభ్యర్థన

By

Published : Jan 9, 2023, 4:00 PM IST

వంతెన లేక విద్యార్థుల అవస్థలు
వంతెన లేక విద్యార్థుల అవస్థలు ()

Difficulties for students to cross the canal: అక్కడి విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే నిత్యం సాహసం తప్పనిసరి. రెండు స్తంభాలపై నుంచి జాగ్రత్తగా కాలువ దాటాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పది అడుగుల లోతున్న కాలువలో పడటం కొట్టుకుపోవడం ఖాయం. కానీ చదువుపై ఉన్న శ్రద్ధ ఆ విద్యార్థులను రోజూ ఈ సహసానికి పురికొల్పుతోంది. ఈ వ్యధ నుంచి తప్పించాలని అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోవడం లేదట. చదువుకొనేందుకు రోజూ ప్రాణాలతో పోరాటం చేస్తున్న ఈ విద్యార్థుల బాధలు మీరు తెలుసుకోండి.

వంతెన లేక విద్యార్థుల అవస్థలు

Difficulties for students to cross the canal: నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం, గోటూరు గ్రామం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పొలాల్లో పిల్లబాట వెడల్పులో ఉండే రెండు విద్యుత్తు స్తంభాలపై నుంచి నడుచుకుంటూ భయం భయంగా బడికి వెళుతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటే రోజు వారికి కత్తి మీద సామే అని చెప్పాలి. ఉదయం బడికి వెళ్లే సమయంలో, సాయంత్రం బడి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో విద్యార్థులకు సాహసమైన ఫీట్లు తప్పడం లేదు.

గ్రామానికి కిలోమీటరు దూరంలో పాఠశాల ఉంది. అక్కడకు వెళ్లాలంటే సుమారు పది అడుగుల కంటే లోతైన కోయిల సాగర్ కుడికాలువ దాటాలి. రైతులు తమ పొలాలకు వెళ్లడానికి కాలువపై రెండు స్తంభాలను వేసి సిమెంటు కాంక్రీట్ వేశారు. దీనిపై నుంచే విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. పాఠశాలకు సుమారు 300 మీటర్ల దూరంలో వంతెన ఉన్నప్పటికి.. దూరమని విద్యార్థులు దాన్ని వినియోగించుకోవడంలేదు.

గోటూరు గ్రామంతోపాటు కొండ్రోనిపల్లి గ్రామ విద్యార్థులు ఈ పాఠశాలకు రావాలంటే రోజు సాహసం చేయాల్సిందే. ఈ పాఠశాలలో 194 మంది విద్యార్థులు చదువుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వంతెన నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు.

"మా గ్రామానికి కిలోమీటరు దూరంలో బడి ఉంది. పాఠశాలకు వెళ్లాలంటే కోయిలసాగర్ కాలువను దాటాలి. కాలువపై వంతెనను పాఠశాలకు దూరంగా నిర్మించారు. రైతులు కాలువపై వేసిన కరెంటు స్తంభాలపై నడుచుకుంటూ స్కూల్​కి వస్తున్నాము. దాటడానికి ప్రమాదకరంగా ఉంది. మా పాఠశాలకు దగ్గర్లో కాలువపై వంతెన నిర్మించాలని కోరుతున్నాం". -విద్యార్థులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details