తెలంగాణ

telangana

BANDI SANJAY: తెరాసపై విమర్శల ఘాటు పెంచిన బండి.. కేసీఆర్​కు సవాల్​..!

By

Published : May 1, 2022, 8:04 AM IST

Updated : May 1, 2022, 9:51 AM IST

BANDI SANJAY: 'తెరాస'పై విమర్శల ఘాటు పెంచిన బండి.. కేసీఆర్​కు సవాల్​..!

BANDI SANJAY: ఇఫ్తార్ విందులో పాల్గొని ఒవైసీ ఇచ్చిన టోపీ పెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు.. అసదుద్దీన్‌ నుదుట బొట్టు పెట్టి జైశ్రీరాం అనిపించే ధైర్యముందా అని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్‌ విసిరారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగిస్తున్న బండి.. తెరాస సర్కారుపై విమర్శల ఘాటు పెంచారు. ధరణి పోర్టల్‌తో వేల ఎకరాల పేదల భూమి కొల్లగొట్టేందుకు కుట్రపన్నారని ఆరోపించారు.

BANDI SANJAY: ముఖ్యమంత్రి కేసీఆర్‌ మత రాజకీయాలు చేస్తూ.. రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ దుయ్యబట్టారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 17వ రోజు భీవండి కాలనీ, సింగారం గేట్, జాజాపూర్, చిన్నజెట్రం, పెద్ద జెట్రం, అంత్వర గేట్ వరకూ పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఇఫ్తార్ విందుకు వెళ్లిన కేసీఆర్​.. కేంద్రాన్ని, మోదీని తిట్టడం ఏంటని బండి మండిపడ్డారు. దసరా, దీపావళి, హనుమాన్, అయ్యప్ప దీక్షలకు ఒవైసీని ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు.

BANDI SANJAY: తెరాసపై విమర్శల ఘాటు పెంచిన బండి.. కేసీఆర్​కు సవాల్​..!

ధరణి పోర్టల్ కేసీఆర్ కుటుంబానికి తప్ప.. సామాన్యులకు ఉపయోగపడలేదని బండి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో కబ్జా చేసిన భూములు చాలవని.. జిల్లాకో వెయ్యి ఎకరాల భూమిని కేసీఆర్​ స్వాధీనం చేసుకునేందుకు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. భాజపా అధికారంలోకి వచ్చాక.. ధరణి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

‘ఛాయ్ పే చర్చ’..: ఈ క్రమంలోనే సింగారం గేటు వద్ద రైతు సదస్సులో పాల్గొన్న బండి సంజయ్​.. చిన్నజెట్రంలో ‘ఛాయ్ పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. శిథిలమైన ఇళ్లను చూసి చలించిపోయిన సంజయ్‌.. ముంబయికి ఉపాధి కోసం వలస వెళ్లారని తెలుసుకుని వారితో ఫోన్‌లో మాట్లాడారు. అంత్వర గేటు వద్దకు చేరుకుని.. మాదాసి, కురువ సంఘాల నాయకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భాజపా అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. అంత్వర గేటు సమీపంలో రాత్రి బండి సంజయ్‌ బస చేశారు. ఇవాళ కొల్లంపల్లి, లింగంపల్లి స్టేజ్, ధన్వాడ మీదుగా మణిపూర్ తండా వరకు పాదయాత్ర కొనసాగనుంది.

ఇవీ చూడండి..

15 రోజులు గడిచాయ్.. మీ యాక్షన్ ఏదీ?.. కేసీఆర్​కు బండి లేఖ

స్టార్​ హీరోలతో పనిచేస్తే వాటిని ఎదుర్కోవాల్సిందే!: తమన్

Last Updated :May 1, 2022, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details