తెలంగాణ

telangana

Heavy rains: ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం... ఆ ఊర్లలో రాకపోకలు బంద్‌!

By

Published : Sep 3, 2021, 10:18 AM IST

Updated : Sep 3, 2021, 10:40 AM IST

Heavy Rains in Nalgonda district
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని కొన్ని మండలాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీని వలన పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్ష బీభత్సం

తెలంగాణలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పారుతున్నాయి. నల్గొండ జిల్లా చండూర్, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీని వలన పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చండూర్ మండలంలోని చండూర్‌, బొడంగిపర్తి వాగు ఉద్ధృతంగా ప్రవహించడం వల్ల చండూర్‌, మునుగోడుకు రాకపోకలు నిలిచిపోయాయి. చండూర్‌ పురపాలికలోని అంగడిపేట వాగు.. ప్రధాన రహదారిపై ఉద్ధృతంగా రావడం వల్ల చండూర్‌, మర్రిగూడెంకు రాకపోకలు నిలిచిపోయాయి. చండూర్‌ మండలం శిర్దేపల్లి, గొల్లగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయింది. మొత్తానికి చండూర్‌కు రావాల్సిన అన్ని దారులు స్తంభించాయి.

దీంతో నల్గొండ వైపు మాత్రమే వెళ్లడానికి అవకాశం ఉంది. మునుగోడు మండలంలోని కొరటికల్, మునుగోడు మండల కేంద్రంలోని మర్రివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షాలు కురవడం వల్ల పత్తి పంటలో నీళ్లు చేరి.. తెగుళ్ల బారిన పడే అవకాశం ఉందని రైతలు ఆందోళన చెందుతున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. బీబీనగర్, వలిగొండ మండలాల్లో ముసురు కమ్ముకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసి నదికి వరద పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగెం - బొల్లెపల్లి గ్రామాల మధ్య ఉన్న భీమలింగం వద్ద లోలెవెల్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి మూసి నది ప్రవహిస్తుంది. వరద ఉద్ధృతితో సంగెం- బొల్లెపల్లి పరిసర గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగింది

ఇదీ చదవండి: hyderabad rains: జంట నగరాల్లో భారీ వర్షం.. చెరువులైన రహదారులు

Last Updated :Sep 3, 2021, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details