తెలంగాణ

telangana

ఈటల కుటుంబ సభ్యులకు అమిత్‌ షా పరామర్శ

By

Published : Sep 17, 2022, 5:45 PM IST

Updated : Sep 17, 2022, 6:19 PM IST

ఈటల రాజేందర్‌
ఈటల రాజేందర్‌ ()

మేడ్చల్‌ జిల్లా శామీర్‌ పేటలోని ఈటల రాజేందర్‌ నివాసానికి హోం మంత్రి అమిత్‌ షా వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవల ఈటల తండ్రి మల్లయ్య మృతి చెందిన విషయం తెలుసుకున్న అమిత్ షా.. ఇవాళ వారి ఇంటికి వెళ్లారు. మల్లయ్య చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.

తెలంగాణ విమోచన దినోత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా మేడ్చల్‌ జిల్లా శామీర్​పేట్​లోని ఈటల రాజేందర్‌ ఇంటికి వెళ్లారు. ఇటీవల ఈటల రాజేందర్‌ తండ్రి మల్లయ్య హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందతూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈటల ఇంటికి వెళ్లిన అమిత్‌ షా మల్లయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. అమిత్‌ షాతోపాటు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సైతం ఈటల రాజేందర్‌ ఇంటికి వెళ్లారు.

అంతకు ముందు కేంద్ర మంత్రి అమిత్ షా.. పరేడ్ గ్రౌండ్స్‌లో అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్ ప్రాంతానికి విముక్తి లభించి 75 ఏళ్లయినా తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ప్రధాన మంత్రి మోదీ ప్రకటన చేసిన తర్వాతే మిగతా పార్టీలు నిద్రలో నుంచి మేల్కొన్నాయని వ్యాఖ్యానించారు. ఇన్నాళ్లు ఏ ప్రభుత్వం కూడా విమోచన దినోత్సవం నిర్వహించేందుకు సాహసించ లేదని చెప్పారు.

ఈటల కుటుంబ సభ్యులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

అనంతరం ప్రధాని మోదీ జన్మదినం పురస్కరించుకుని సికింద్రాబాద్​లో ​దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, పరికరాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి అమిత్‌షా ముఖ్యఅతిథిగా హాజరైనారు. సిక్‌ విలేజ్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో దివ్యాంగులకు అవసరమైన ట్రై సైకిళ్లు, ఆట పరికరాలను ఆయన అందజేశారు. వాజ్‌పేయి ఫౌండేషన్, భారత్ సేవా సహకార్ ఆధ్వర్యంలో పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని మోదీ చెప్తుంటారని అమిత్ షా పేర్కొన్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు సాయం చేయడమంటే మోదీకి చాలా ఇష్టం అని తెలిపారు. డబ్బు రూపంలో కంటే అవసరమైన వస్తురూపంలో సాయం చేయటం మంచిదన్నారు. అంధులు గుర్తించేలా మోదీ కొత్త నోట్లు తీసుకువచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్​రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, బండి సంజయ్, ఇతర భాజపా నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:Amit Shah at TS Liberation Day celebrations : తెలంగాణ అమరవీరులకు అమిత్ షా ఘననివాళి

ప్రతి ఒక్కరు సేవా కార్యక్రమాలు చేయాలని మోదీ చెప్తుంటారు: అమిత్ షా

దేశంలో చీతాల సందడి షురూ.. చూసేందుకు ఇప్పుడే రావొద్దన్న మోదీ

Last Updated :Sep 17, 2022, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details