తెలంగాణ

telangana

Huzurabad by election: భాజపాకు ఎందుకు ఓటు వేయాలి: హరీశ్​ రావు

By

Published : Sep 8, 2021, 9:00 PM IST

harish rao

హుజూరాబాద్​ ఉపఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ దూసుకెళ్తోంది. ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. వీణవంక మండలంలో హరీశ్‌రావు పర్యటించారు. బ్యాంకు వద్ద స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు కనబడటంతో కొద్దిసేపు ఆగారు. వారితో ముచ్చటించారు.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఉప ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మహిళలతో చిట్‌ చాట్‌ చేస్తున్నారు. మహిళలతో తనదైన రీతిలో మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలంలో హరీశ్‌రావు పర్యటించారు. బ్యాంకు వద్ద స్వశక్తి మహిళా సంఘాల సభ్యులు కనబడటంతో కొద్దిసేపు ఆగారు. వారితో మాట్లాడారు. వడ్డీలేని రుణం డబ్బులు తీసుకున్నారా అని మహిళలను మంత్రి అడిగారు. బ్యాంకర్లు ఏమైనా ఇబ్బందులు పెడుతున్నారా అని మాట్లాడారు. గ్యాస్‌ ధర ఎంత అయిందో తెలుసా అని అడుగుతూ ఇది పెంచింది భాజపాయేనని గుర్తు చేశారు. భాజపాను విమర్శిస్తూనే ప్రచారం చేస్తున్నారు. పింఛన్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలకు డబ్బులు ఇస్తుంది ఎవరిని అడుగగా కారు సారు ఇస్తున్నారని మహిళలు చెప్పారు. ఆ సారును మరిచిపోవద్దని ఓ వృద్ధురాలిని దగ్గరకు తీసుకొన్నారు.

అనంతరం జమ్ముకుంటలో హరీశ్​ రావు పర్యటించారు. పెంచిన గ్యాస్‌, డీజిల్‌ ధరలను సగానికి తగ్గించి ఉప ఎన్నికలో ఓట్లడుగాలని డిమాండ్​ చేశారు. భాజపా నాయకులు పింగిలి రమేశ్​, చుక్కా శ్రీకాంత్‌లతో పాటు పలువురు నాయకులు తెరాసలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కేసీఆర్‌ హుజూరాబాద్‌కు కేటాయించిన రెండు పడకల గదులల్లో మాజీమంత్రి ఈటల ఒక్కటైనా కట్టించి ఇచ్చారా అని ప్రశ్నించారు. మొన్న ఓ కేంద్రమంత్రి కేసీఆర్‌ రెండు పడకల గదులు ఇచ్చారా అని అడుగుతున్నారని, అది అడగాల్సింది కేసీఆర్‌ను కాదని, ఆ పార్టీ నాయకుడు ఈటలనే అడగాలన్నారు. మంత్రిగా ఉన్నప్పుడే ఒక్క ఇల్లు కట్టివ్వని వ్యక్తి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేపు ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. భాజపాకు డిపాజిట్‌ కూడ రాదని ధ్వజమెత్తారు. ఓ వ్యక్తి ప్రయోజనాలు ముఖ్యమా లేక నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు ముఖ్యమా అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. రెండు నెలలు కష్టపడండి మేం రెండేళ్లు ప్రజా సేవ చేస్తామన్నారు.

భాజపాకు ఎందుకు ఓటు వేయాలి: హరీశ్​ రావు

'గ్యాస్​ సబ్సిడీ ఎత్తేశారు. ఇదే భాజపా రోడ్లు, రైలు, ఎల్​ఐసీని అమ్ముతోంది. భాజపాకు దేని కోసం ఓటు వేయాలి. దొడ్డు వడ్లు కొనమన్నందుకు ఓటు వేయాలా. ఎందుకు ఓటు వేయాలి. ఏం చేశారని ఓటు వేయాలి.'

-హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఇదీ చదవండి:Tollywood drugs case : ముగిసిన రానా విచారణ.. కెల్విన్​తో లావాదేవీలపై ఈడీ ఆరా

ABOUT THE AUTHOR

...view details