తెలంగాణ

telangana

Bear: చింతచెట్టుపై ఎలుగుబంటి.. మత్తుమందు ఇచ్చి బంధించి..

By

Published : Jun 11, 2021, 7:26 PM IST

Bear at tamarind tree
Bear: చింతచెట్టుపై ఎలుగుబంటి.. స్థానికులు ఫిర్యాదు ()

జనగామ జిల్లా జాఫర్​గడ్ హిమ్మత్​నగర్​లో ఎలుగుబంటి(Bear) హల్​చల్​ సృష్టించింది. స్థానిక చింతచెట్టుపై కూర్చున్న ఎలుగుబంటి.. నాలుగు గంటలకు పైగా చెట్టుపైనే ఉండటం వల్ల స్థానికులు భయాందోళన చెంది.. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం ఎలుగుబంటిని బంధించి తీసుకెళ్లారు.

జనగామ జిల్లా జాఫర్​గడ్ హిమ్మత్​నగర్​లో ఎలుగుబంటి(Bear) కలకలం రేపింది. గ్రామంలోని చింతచెట్టుపై తిష్ఠ వేసిన ఎలుగుబంటి... నాలుగు గంటలకుపైగా చెట్టుపైనే ఉండడం వల్ల… గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

స్థానికుల సమాచారంతో వరంగల్ నుంచి వచ్చిన అటవీ శాఖ రెస్క్యూ టీం అధికారులు… గంటకుపైగా శ్రమించి మత్తు మందు ఇచ్చి ఎలుగుబంటిని బంధించారు. స్థానిక
అటవీ ప్రాంతంలో వదిలేస్తామని సిబ్బంది తెలిపారు. ఎలుగుబంటిని అధికారులు బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Bear: చింతచెట్టుపై ఎలుగుబంటి.. స్థానికులు ఫిర్యాదు

ఇదీ చూడండి:20 ఏళ్లు ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిని అక్రమంగా కేసుల్లో ఇరికిస్తారా: తరుణ్​ చుగ్​

ABOUT THE AUTHOR

...view details