తెలంగాణ

telangana

Double bedroom houses: రెండు పడక గదుల ఇళ్ల తాళాలు పగలగొట్టిన లబ్ధిదారులు.. ఎందుకంటే!

By

Published : Sep 3, 2021, 2:05 PM IST

Updated : Sep 3, 2021, 4:25 PM IST

Double bedroom houses, Beneficiaries broke double bedroom houses

14:00 September 03

తాళాలు పగులగొట్టి రెండు పడక గదుల ఇళ్లల్లోకి వెళ్లిన లబ్ధిదారులు

తాళాలు పగులగొట్టి రెండు పడక గదుల ఇళ్లల్లోకి వెళ్లిన లబ్ధిదారులు

జగిత్యాల జిల్లాలో రెండు పడకగదుల(double bedroom houses) ఇళ్ల తాళాలు పగలగొట్టి లబ్ధిదారులు ప్రవేశించారు. ఇళ్ల పంపిణీ ఆలస్యం కావడంతో ఇళ్లలోకి చేరారు. జిల్లాలోని మల్యాల మండలం నూకపల్లి అర్బన్‌ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిర్మాణం పూర్తయినా.. పంపిణీ చేయడం లేదని వారు ఆరోపించారు. వర్షాలతో(rains in telangana) గుడిసెల్లో ఇబ్బంది పడలేక అధికారులకు తెలియకుండా తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించినట్లు వివరించారు.

 

అవస్థలు పడలేక..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. మొత్తం 15 కుటుంబాలు వారు కొత్త ఇళ్లలోకి ప్రవేశించారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి చేరుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  

 

ఆలస్యమెందుకు?

భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొలేక ఇళ్లలోకి చేరామని.. ఎప్పుడో నిర్మాణం పూర్తయిన తమకు ఇళ్లను అప్పగించటం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ 65 ఇళ్లు నిర్మించగా... నూకపల్లి, పోతారం, రామన్నపేట తదితర గ్రామాల ప్రజల కోసం కేటాయించినట్లు తెలిపారు. లబ్ధిదారులను సైతం ఎంపిక చేసి... ఇంతవరకు పంపిణీ కార్యక్రమం చేపట్టలేదని వాపోయారు.  

ఇదీ చదవండి:Corona Cases in Schools: పాఠశాలలపై కరోనా పంజా.. రెండు చోట్ల ఐదుగురికి పాజిటివ్

Last Updated :Sep 3, 2021, 4:25 PM IST

ABOUT THE AUTHOR

...view details